ఎక్కడైనా ఎన్నికలు జరుగుతుంటే, అభివృద్ధి అజెండాతో అధికార పక్షం, అంత కంటే బాగా చేస్తామని ప్రతిపక్షం ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. గత పదేళ్లుగా ట్రెండ్ మారింది కాబట్టి, డబ్బు, మద్యం, వస్తువులు పంచి పెట్టటం వచ్చి చేరాయి. ఇక 2019 నుంచి ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పోటీ చేస్తే పీకుతున్నారు, వేరే పార్టీకి ఓటు వేస్తే పీకుతున్నారు, నుంచుంటే పీకుడు, కూర్చుంటే పీకుడు, అక్రమ కేసులు, అక్రమ అరెస్ట్ లు, ఇలా ఒక్కటి ఏమిటి, ఏమి చెయ్యల్లో అన్నీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ మరింత ముందుకు వెళ్లి, ఏకంగా దేవుడిని కూడా ఇందులోకి లాగింది. వైసీపీ నేతల వ్యవహార శైలి ఈ విషయంలో తీవ్ర దుమారం రేపుతుంది. చిత్తూరు జిల్లా, చంద్రగిరి నియోజకవర్గంలో, 21వ తేదీ జరగబోయే నాలుగవ విడత పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో, వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి భార్య దీపిక అనే ఆమె పోటీ చేస్తున్నారు. అయితే ప్రచారం సందర్భంగా, ప్రజలను ప్రలోభపెట్టటానికి, తిరుమల లడ్డులను పెద్ద ఎత్తున తెప్పించుకుని, ఒక చోట పెట్టుకుని, కొత్తగా వచ్చిన రేషన్ డెలివరీ చేసే వాహనాలు ఉన్నాయో, వాటిల్లో తరలిస్తూ, ఓటర్లను ప్రలోభపెట్టే దానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంత మందికి కుటుంబాలకు కుటుంబాలకు కొన్ని బ్యాగులు ఇచ్చి, పంచిపెట్టమని అప్ప చెప్పారు.
ఈ నేపధ్యంలోనే కొంత మంది వీటిని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ ఘటన పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వైసీపీ లాంటి ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు చూడలేదని, పదవుల కోసం చివరకి తిరుమల లడ్డూని కూడా వాడుకునే విధంగా దిగజారి పోయారని చెప్పి, చాలా తీవ్రమైన విమర్శలు చేసారు. పవిత్రంగా భావించే లడ్డూని కూడా ఏకంగా రేషన్ సప్లై చేసే వ్యాన్ లో, తీసుకుని వచ్చి పంచి పెట్టటం అనేది జీర్ణించుకోలేక పోతున్నారు. రెండోది, దాన్ని నుంచి ప్రలోభపెట్టి ఓట్లు వేసుకుంటానికి కూడా వేసుకోవటం అంటే, అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఏమి చేస్తున్నారు అనేది పరాకాష్టగా చెప్తున్నారు. ఎన్నికల్లో దేవుడిని లాగటం ఒక ఎత్తు అయితే, ఇలా లడ్డులు పంచి పెట్టి, మాకు ఓటు వేయండి అని చెప్పటం, ఎప్పుడూ చూడలేదని, వినలేదని, ఈ ఎన్నికలు అయ్యే లోపు ఇంకా ఎన్ని వింతలు, విచిత్రాలు, అరాచాకాలు చూడాలో అని, వైసీపీ నేతల పై ప్రజలు మండి పడుతున్నారు.