తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసిన తీరు పై తెలుగుదేశం నేటా వర్ల రామయ్య వివరించారు. ఆ ప్లానింగ్ చూస్తే ఎవరైనా అవాక్కావ్వాల్సిందే. రెండు మూడు రోజులు ముందుగానే వాలంటీర్లు ద్వారా, ఎవరు ఏంటి అనేది ఒక అంచనాకు వచ్చారు. తెలుగుదేశం వాళ్ళ ఓట్లు దొంగ ఓట్ల రూపంలో, మొదటి గంటలోనే వేసేయటానికి ప్లాన్ వేసారు. ఇక ఊరిలో లేని వాళ్ళవి, చనిపోయిన వారివి, ఇలా అనేక మందివి కూడా దొంగ ఓట్లు వేయటానికి ప్రణాళికలు వేసారు. దొంగఓటర్లను సృష్టించి, నకిలీ ఓటర్ కార్డులను తయారుచేశారు. పక్క నియోజకవర్గాల నుంచి జనాలను తోలుకుని వచ్చి, కళ్యాణమండపాల్లో, అపార్ట్ మెంట్ లలో పెట్టారు. అక్కడ నుంచి ఉదయమే, ఏ బూత్ కు ఆ బూత్ కు పంపించారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చివనారికి ఇచ్చిన గుర్తింపుకార్డుల వెనుక ఒక సీరియల్ నంబర్ ఉంది. ఆ సీరియల్ నెంబర్ ఆధారంగా, ఎక్కడ ఓటు వేయాలి, ఎవరికీ ఓటు వేయాలి, ఎంత డబ్బులు ఇవ్వాలి, ఇలా మొత్తం సెట్ చేసారు. వర్ల రామయ్య మాట్లాడుతూ "వారి ఐడీకార్డులు చూసి, వారు కడపనుంచి వచ్చారని గుర్తించి, క్యూలో నిలబడిన వారిని తండ్రిపేరేమిటని ఆయన అడిగితే, కార్డులో ఉంది చూసుకోమని చెప్పారు. పెద్దిరెడ్డిగారు... మీ నియోజకవర్గంలో తండ్రిపేరు అడిగితే, కాగితాల్లో, కార్డుల్లో చూసుకోమని చెబుతారా? ఇదెక్కడి అన్యాయమండీ... ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా? నకిలీ కార్డులు ఇచ్చిన వాడు ఏదైనా అడిగితే, సహజంగా పారిపోతాడు. కానీ పెద్దిరెడ్డి జమానాలో దొంగలే ధైర్యంగా, దర్జాగా నిలబడి ఎదురు మాట్లాడుతున్నారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చివనారికి ఇచ్చిన గుర్తింపుకార్డుల వెనుక ఒక సీరియల్ నంబర్ ఉంది. వాలంటీర్లంతా వైసీపీ ప్రచారకులని నిన్ననే చెప్పాను. వారంతా వైసీపీ ప్రచార ఇన్ ఛార్జ్ లని నేను నిన్ననే చెప్పాను. వారంతా వారివారి ప్రాంతాలలో చనిపోయినవారు, ఇతరరాష్ట్రాలకు వెళ్లిన వారు, దేశాంతరం వెళ్లినవారి ఓటర్ లిస్ట్ అంతా తయారుచేసి, పెద్దిరెడ్డి అండ్ కో కు ఇచ్చారు. వారేమో దొంగఓటర్లను సృష్టించి, నకిలీ ఓటర్ కార్డులను తయారుచేశారు."

"నా తండ్రి ఫలానా అతనని నేను ధైర్యంగా చెబుతాను. పెద్దిరెడ్డి పంపిన దొంగఓటర్లలా కాగితాల్లో చూసుకోండని చెప్పను. ప్రజాస్వామ్యమా రాష్ట్రంలో నీ అడ్రస్ ఎక్కడ అని అడుగుతున్నాను. చిత్తూరుజిల్లాలో, తిరుపతిలో ప్రజాస్వామ్యం అడ్రస్ ఎక్కడుందో పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు సమాధానంచెప్పగలరా? తాను అడిగే ప్రశ్నలకు పెద్దిరెడ్డి, ఆయన ప్రభుత్వం సిగ్గుతో కుంచించుకుపోవాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో దొంగఓటర్లు నిర్లజ్జగా, నిస్సిగ్గుగా క్యూలైన్లలో నిలబడ్డారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడతారు? కాపాడాల్సిన ముఖ్యమంత్రి తప్పుడు విధానాలకు దొంగవిధానాలకు, అడ్డదారులకు సై అంటుంటే, ఆపాల్సిన పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా నిస్తేజంగా కూర్చుంది. సవాంగ్ నాయకత్వం లోని పోలీస్ వ్యవస్థ ఉపఎన్నిక నిర్వహణలో ఘోరంగా విఫలమైంది. తిరుపతికి 4వేలబస్సులొస్తే, ఆ విషయం డీజీపీకి తెలియదా? బస్సులలో వచ్చినవారంతా స్వామివారిని దర్శించుకోవడానికి రాలేదు. పెద్దిరెడ్డిస్వామివారి తరుపున దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు. పీఎల్ ఆర్ కళ్యాణమండపంలోఎంతమంది రాత్రి నిద్ర చేశారో పోలీసులకు, డీజీపీకి తెలియదా? దొంగఓట్లు అంత నిర్లజ్జగా, నిస్సిగ్గుగా వేస్తుంటే పోలీసులకు తెలియదా? ఎన్నికలకమిషన్ ఎంతలా, ఎన్నిరకాలుగా ఆదేశిస్తున్నా కింద అమలుచేయాల్సింది జగన్ బృందమే కదా. ఆ బృందం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశాలను సరిగా అమలుచేయడంలేదుకదా? దొంగఓట్లు వేసేవారిని ఎవరు ఆపుతారా? ఎవరో ఏజెంట్ దొంగ ఓట్ వేస్తున్నాడంటే, అతన్ని పట్టుకొని బూత్ లోనే పడేసి కొట్టారంట. అలాగైతే ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడతారు? కొందరు ఆడవారు వ్యాన్లలో వచ్చి తిరుపతిలో దిగారు. వారిభర్త పేరు, తండ్రిపేరు అడిగితే చెప్పడంలేదు. వారంతా పెద్దిరెడ్డి పంపిన దొంగఓటర్లే. ఈ తంతు ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యాన్ని ఎవరురక్షిస్తారు? తిరుపతిలో ప్రజాస్వామ్యాన్నికాపాడేది ఎవరని నేను ప్రశ్నిస్తున్నాను. " అని వర్ల రామయ్య అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read