భారత దేశ ప్రజాస్వామ్య విలువలను అపహస్యం చేస్తూ, జరిగిన తిరుపతి ఉప ఎన్నికల తీరు పై, తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి, అలాగే బీజేపీ ఎంపీ అభ్యర్ధి రత్నప్రభ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తిరుపతి ఉప ఎన్నికలలో రీపోలింగ్ పెట్టాలి అంటూ, టిడిపి అభ్యర్ధి పనబాక లక్ష్మి, అలాగే తిరుపతి ఎన్నిక రద్దు చేయాలి అంటూ, బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఇరువురు పిటీషన్లు కలిపి, ఈ రోజు హైకోర్టు విచారణ చేసింది. ఈ రెండు పిటీషన్లు, ముందుగా ఎన్నికల కమిషన్ వద్ద పిటీషన్ కు అవకాసం ఉంది కదా అని హైకోర్టు ప్రశ్నించింది. దొంగ ఓట్లు వేసినట్టు ఆధారాలు ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, ఎలక్షన్ కమిషన్ వద్దే పిటీషన్ వేయవచ్చు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఎలక్షన్ కమిషన్ వద్దే పిటీషన్ వేసుకునే సమయం ఉన్నప్పుడు, మేము ఈ పిటీషన్ ను విచారణకు తీసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రసుత్తం ఉన్న స్థితిలో, ఇవి ఎలక్షన్ కమిషన్ వద్దే తేల్చుకోవాలని, మేము ఈ పిటీషన్ల పై జోక్యం చేసుకోలేం అంటూ, పనబాక లక్ష్మి, రత్నప్రభ వేసిన పిటీషన్లను హైకోర్టు కొట్టేసింది. అయితే ఇప్పుడు ఇరువురు ఏమి చేస్తారు అనే అంశం పై ఆసక్తి నెలకొంది. ఎవరైనా ఈ విషయం పై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తారా లేదా అనేది చూడాలి.

tirupati 300042021 2

మరో పక్క మే రెండో తేదీన ఫలితాలు వస్తాయి. అంటే ఇంకా రెండు రోజులు సమయమే ఉంది. ఈ రెండు రోజుల్లో కౌంటింగ్ జరపకుండా ఆపగలరా లేదా అనేది చూడాలి. అయితే ఇప్పటికే ఎన్నికల కమిషన్ వద్ద, ఇరు పార్టీ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరి తదుపరి అడుగులు ఎలా వేస్తారో చూడాలి. తిరుపతి ఉప ఎన్నికల జరిగే రోజు ఉదయమే, అనేక బస్సుల్లో పక్క ఊరులు నుంచి జనాలను తోలుకుని వచ్చిన వీడియోలు అందరూ చూసారు. వారిని ఒక మంత్రికి సంబంధించి కళ్యాణమండపంలో పెట్టటం, అలాగే అక్కడ నుంచి బస్సుల్లో పోలింగ్ బూత్ లకు తరలించటం, అలాగే పోలింగ్ లైన్లలో కూడా, దొంగ ఓట్లు వేసే వారిని పట్టుకోవటం, వారు కనీసం కార్డ్ మీద ఉన్న తండ్రి పేరు కానీ, భర్త పేరు కానీ చెప్పలేక పోవటం, కొంత మంది మీడియాను చూసి పరిగెత్తటం ఇవన్నీ చూసాం. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆ రోజు కనీసం వంద వీడియోలు బయటకు వచ్చాయి. అయితే ఈ విషయం పై, ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఏమి స్పందించలేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read