తిరుపతి రుయా ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. రుయాలోని కో-వి-డ్ వార్డులో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం జరగటంతో, ఐసియిలో చికిత్స పొందుతున్న దాదాపు 10 మంది రోగులు మృతి చెందారు. ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసే అమయంలో కంప్రెజర్ తగ్గటంతోనే, ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం జరిగిందని ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. అయితే ఆక్సిజన్ సరఫరా మళ్లీ మొదలయ్యిందని అధికారులు చెప్తున్నూర్. మరో పక్క రుయా ఆస్పత్రిలో ఈ ఘటన జరిగిన తరువాత తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మా బంధవులకు వెంటనే ఆక్సిజన్ అందించాలి అంటూ ఐసీయూ వార్డులో ఉన్న రోగుల తరుపు బంధువుల ఆందోళన వ్యక్తం చేసారు. ఆగ్రహం కట్టలు తెంచుకోవటంతో, ఐసీయూ వార్డులో ఉన్న వస్తువులను పగులగొట్టారు. మా వాళ్ళు చనిపోవటానికి మీ నిర్ల్యక్షమే కారణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేయటంతో, అక్కడ ఉన్న వైద్య సిబ్బంది, డాక్టర్లు, నర్సులు పరుగులు తీసారు. దగ్గరలో ఉన్న గదుల్లో దాక్కుంటే, అక్కడకు కూడా వెళ్లి వారిని కొట్టే ప్రయత్నం చేసారు. సకాలంలో పోలీసులు రావటంతో, అక్కడ నుంచి వైద్య సిబ్బందిని తప్పించారు. అయితే లోపల పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ తెలియటం లేదని, ఎంత మంది చనిపోయారో అర్ధం కావటం లేదని రోగులు తరుపు బాంధవులు వాపోతున్నారు.

tirupati 10052021 2

మరో పక్క ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు స్పందించారు. "ప్రభుత్వం అక్రమ కేసుల మీద పెట్టిన శ్రద్ధ.. ఆక్సిజన్ సరఫరాలో చూపడం లేదు. ఆక్సిజన్ అందక వరుస సంఘటనలు జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. తిరుపతి రూయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక పది మందికి పైగా మృతి చెందడం బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ప్రభుత్వం యుద్ధప్రాతికన ఆక్సిజన్ అందించి కోవిడ్ రోగులను కాపాడాలి. ఆక్సిజన్ అందక రోజుకొక జిల్లాలో కరోనా రోగులు చనిపోతున్నా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. 10 రోజుల్లో ఆక్సిజన్ అందక 30 మంది ప్రాణాలు పోగొట్టుకున్నా ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేదు.ప్రజల ప్రాణాలు పోతుంటే మీకు లెక్కలేదా? శవాల దిబ్బలపై రాజ్యామేలదామనుకుంటున్నారా?" అంటూ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read