తిరుపతి ఉప ఎన్నికల్లో, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు లోలోపల బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేస్తుందనే అనుమానం ఉన్నా, అవన్నీ దూరం చేసి, చివరకు జనసేన, బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పవన్ కళ్యాణ్ కూడా నిన్న తిరుపతి వచ్చి, ఒక పది నిముషాలు నడిచి, కార్ లో ర్యాలి చేసి, మీటింగ్ లో కూడా పాల్గున్నారు. బీజేపీ అభ్యర్ధి రత్నప్రభకు ఓటు వేయాలని కోరారు. అయితే పవన్ కళ్యాణ్ వచ్చి, 24 గంటలు కూడా కాక ముందే, అటు జనసేన పార్టీకి, ఇటు బీజేపీ పార్టీకి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుని ఎలక్షన్ కమిషన్. తిరుపతిలో నవతరం పార్టీ కూడా పోటీ చేస్తుంది. అయితే అనూహ్యంగా వారికి గాజు గ్లాసు గుర్తును ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు కూడా గాజు గ్లాసు అనే విషయం ఇప్పటికే అందరికీ తెలుసు. దీంతో ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో, నవతరం పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించటంతో, జనసేన, బీజేపీ షాక్ తిన్నాయి. నవతరం పార్టీ తరుపున డాక్టర్ గోదా రమేష్ కుమార్ అనే వ్యక్తి, తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. దీంతో ఆయన గాజు గ్లాసు గుర్తు పెట్టుకుని, ఎన్నికల ప్రచారానికి సిద్దం అవుతున్నారు. ఎలక్షన్ కమిషన్, ఈ నిర్ణయం ప్రకటించింది.

veerraju 04042021 2

దీంతో నవతరం పార్టీ ఎన్నికల కమిషన్ కి ధన్యవాదాలు చెప్పారు. తమ గుర్తుతో ఎన్నికల ప్రచారం మరింతగా చేస్తామని, తమకు ఓటు వేసి గెలిపించాలని పత్రికా ప్రకటన విడుదల చేసారు. మరో పక్క తిరుపతి ఉప ఎన్నికలో, జనసేన పార్టీ పోటీ చేయకుండా, బీజేపీ పార్టీకి మద్దతు పలికింది. బీజేపీ పార్టీ ఎన్నికల గుర్తు కమలం గుర్తు. రేపు ఎన్నికల్లో ఓటు వేయటానికి వెళ్ళిన జనసేన క్యాడర్, అక్కడ కమలం గుర్తు, గాజు గ్లాసు గుర్తు చూస్తే, పుసుక్కున్న గాజు గ్లాజు గుర్తుకు గుద్దారు అంటే, సోము వీర్రాజుకి దిమ్మ తిరగట ఖాయం. అసలకే నోటాతో పోటీ పడే సోము వీర్రాజు సారధ్యంలోని బీజేపీ, జనసేనతో కలిసి లక్ష ఓట్లు తెచ్చుకోవాలని ప్లాన్లో ఉంది. అయితే, ఈ దెబ్బతో బీజేపీకి కూడా టెన్షన్ పట్టుకుంది. తమకు పడాల్సిన ఓట్లు క్రాస్ అవుతాయని, సోము వీర్రాజు కంగారు పడుతున్నారు. జనసేన పార్టీ రికగ్నైజ్‌డ్ పార్టీ, కకాపోవటంతోనే, నవతరం పార్టీకి గాజు గ్లాసు కేటాయించినట్లు తెలుస్తుంది. అయితే, దీని పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, గుర్తు మార్పించే వీలు ఏమైనా ఉంటుందా అనే పనిలో పడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read