ఉత్తర కోస్తా, ఒడిశాను తిత్లీ తుపాను వణికిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నఈ తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడింది. రేపు తెల్లవారుజామున 4 నుంచి 6 గంట‌ల మ‌ధ్య శ్రీకాకుళం జిల్లా క‌ళింగ‌ప‌ట్నం-సంతబొమ్మాళి మ‌ధ్య తీరం దాటే అవ‌కాశం ఉందని ఆర్టీజీఎస్‌ ద్వారా ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవుల్లో ఏడో నంబర్‌.. విశాఖ, గంగవరం ఓడరేవుల్లో ఐదో నంబర్‌ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. తిత్లీ తుపాను కళింగపట్నానికి 230కి.మీ, గోపాల్‌పూర్‌కు 280 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

srikakulam 10102018 2

దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తీరం వెంబడి 100 నుంచి 130 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని, గాలుల తీవ్రత 145 కి.మీ వరకు పెరిగే అవకాశముందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు రాత్రి, రేపు ఉత్తరాంధ్రలో 15 నుంచి 25 సెంటీమీట‌ర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. అల‌లు 7 మీటర్ల ఎత్తువ‌ర‌కు ఎగ‌సిప‌డే అవ‌కాశాలున్నాయని.. ప్రజ‌లు స‌ముద్ర తీరం వ‌ద్దకు వెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, క‌విటి, మంద‌స‌, ప‌లాస‌, వ‌జ్రపుకొత్తూరు, సంత‌బొమ్మాళి, శ్రీకాకుళం, లావేరు, ర‌ణ‌స్థలం, పాత‌ప‌ట్నం, న‌ర‌స‌న్నపేట‌, పోలాకి, గార‌, ఎచ్చెర్ల‌, ఆమదాల‌వ‌ల‌స‌, పొందూరు, సంత‌క‌విటి, జి.సిగడాం మండలాలు..

srikakulam 10102018 3

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చీపురుప‌ల్లి, పూస‌పాటిరేగ‌, గ‌రివిడి, నెల్లిమ‌ర్ల‌, గుర్ల, విజ‌యన‌గ‌రం, డెంకాడ‌, భోగాపురం, గంట్యాడ‌, బొండ‌ప‌ల్లి, గ‌జ‌ప‌తిన‌గ‌రం, ద‌త్తి రాజేరు.. విశాఖ‌ప‌ట్నం జిల్లాలో బీమునిప‌ట్నం, ఆనంద‌పురం, ప‌ద్మనాభం, విశాఖ‌ప‌ట్నం అర్బన్‌, విశాఖ రూర‌ల్‌ మండలాలపై ప్రభావం పడే అవకాశముంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో సికింద్రాబాద్‌-హవ్‌డా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట, బల్లార్షా, నాగ్‌పూర్‌, బిలాస్‌పూర్‌ మీదుగా దారి మళ్లించారు. తిత్లీ తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని కలెక్టర్ ధనంజయరెడ్డి చెప్పారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే జిల్లా కలెక్టరేట్‌లోని కంట్రోల్‌రూమ్‌కు సమాచారం అందించాలని ఆయన సూచించారు. 120 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున రేపు సాయంత్రం వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read