చంద్రబాబుని లేపేస్తా, లోకేష్ ని చంపేస్తా అంటూ, గత నెలలో వార్తల్లో నిలిచిన రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు, చందు మరోసారి వార్తల్లో నిలించారు. ఈ సారి ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే హడావిడి చేసారు. ఉరవకొండ పోలీస్ స్టేషన్ కు వచ్చి హాల్ చల్ చేసారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిని విడిపించుకుని వెళ్ళటానికి, తన అనుచరులతో వచ్చి, రుబాబు చేసారు. తన అనుచురలు అయిన డివి.నాయుడు, గౌరీశంకర్ ను పోలీసులు అరెస్ట్ చేసారని, వారిని విడిపించుకుని వెళ్ళాలని, సిఐతో మాట్లాడారు. అయితే ఈ తతంగం మొత్తం కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులని బెదిరించారు. ఫోన్లు లాక్కుని వీడియోలు డిలీట్ చేపించారు. ఓ భూవివాదంలో రైతును మోసం చేసారని, తోపుదుర్తి అనుచరులని అరెస్ట్ చేయగా, ఈయన దర్జాగా వచ్చి హడావిడి చేసారు. అధికారం ఉంటే ఇలా ఉంటుంది మరి, వాళ్ళ హవా...

Advertisements

Advertisements

Latest Articles

Most Read