నవ్యాంధ్ర ఆర్ధిక రాజధాని విశాఖకు మరో కంపెనీ వస్తుంది... Gouttephone Technology Private Limited విశాఖపట్నంలోని వరల్డ్-క్లాస్ టచ్ స్క్రీన్ ప్యానెల్ తయారు చేసే ప్లాంట్ మన రాష్ట్రంలో ఏర్పాటు చెయ్యటానికి ముందుకు వచ్చింది. ఈ ప్లాంట్ కోసం, విశాఖలో 76 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. విశాఖపట్నంలోని స్పెషల్ ఎకనిమిక్ జోన్ లో, ఐదు ఎకరాల భూమిని టచ్ స్క్రీన్ ప్యానెల్ తయారీ ప్లాంట్ కు కేటాయిస్తూ, ఆంధ్ర ప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (APEDB) ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ యూనిట్ ప్రారంభం అయితే, సంవత్సరానికి 1.5 మిలియన్ టచ్ స్క్రీన్ ప్యానెల్స్ ఈ కంపెనీ విశాఖలో ఉత్పత్తి చేస్తుంది. ఈ కంపెనీతో 250 ప్రత్యక్ష మరియు 50 పరోక్ష ఉద్యోగాలను రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, అవసరమైన ప్రక్రియ అంతా పూర్తి చేసి,ఈ ప్రాజెక్టును స్థాపించటంలో అవసరమైన మద్దతును అందిస్తుంది. 2018 రెండో అర్ధ భాగంలో ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నిర్మాణం జరిగి, ఉత్పత్తి ప్రారంభించనుంది.
టచ్ స్క్రీన్ ప్యానెల్లు ప్రొడక్షన్ యూనిట్ రావటంతో, విశాఖపట్నం ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ ల తయారీ చేసే నగరాల జాబితాలో చోటు దక్కించుకుంది. Gouttephone Technology Private Limited డైరక్టర్స్ రమేష్ కుమార్, అమర్దీప్ సింగ్ మరియు APEDB CEO J. కృష్ణ కిషోర్ల మధ్య ఒప్పందం జరిగింది. APEDB అధికారుల అంచనా ప్రకారం, విశాఖపట్నం వివిధ రంగాల్లో దేశీయ మరియు విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టటానికి ముందుకు రానున్నాయి...