రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక కార్ల తయారీ సంస్థ వస్తోంది. రాష్ట్రంలో అత్యాధునిక ‘ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌’ వాహనాలను తయారు చేసేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని జపాన్‌కు చెందిన టాయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ తయారీ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అఖిటో తఛిబనతో పాటు ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో టాయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ తయారీసంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు తయారు చేయబోయే కార్ల మోడళ్లను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రదర్శించారు. ఈ సంస్థ టొయోటా మోటార్‌ కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థ.

‘ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌’ వాహనాల తయారీలో ఉపయోగించే ఆధునిక టెక్నాలజీ, యంత్ర సామాగ్రి, పరికరాలు, వాహనాలకు ఉపయోగించే మెటీరియల్‌, వాటి సామర్థ్యం, కాలపరిమితి తదితర కీలకమైన అంశాలపై అఖిటో తఛిబన తన ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ రూపంలో వివరించారు. ఈ వాహనాలు అటు ఇంధనంతోనూ ఇటు బ్యాటరీతోనూ రెండు విధాలుగా పని చేస్తాయని సంస్థ ప్రతినిధుల బృందం స్పష్టం చేసింది. ఈ వాహనాలు ఛార్జింగ్‌తో తక్కువ దూరం ప్రయాణించే విధంగానే కాకుండా, ఎంత దూరమైనా ఇంధనంతో ప్రయాణించే వీలుండటంతో పాటు ఎక్కడైనా ఛార్జింగ్‌ చేసుకునే సౌలభ్యం ఉండేలా రూపొందిస్తున్నట్లు వారు వెల్లడించారు.

అఖిటో తఛిబన బృందం వివరించిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. కంపెనీ ప్రతిపా దనలు బాగున్నాయని, తక్షణమే పనులు ప్రారంభించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అఖిటో తఛిబనతో సీఎం మాట్లా డుతూ ‘మీకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయం అందించడానికైనా సిద్ధంగానే ఉన్నామని, సంస్థ ఏర్పాటుకు అవసరమైన వనరులు సమకూర్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రపంచస్థాయిలో అమరావతిని ఒక మోడల్‌ రాజధానిగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో పనిచేస్తున్నామని’ చెప్పారు. ప్రాజెక్టులు ఆలస్యం అయితే రాష్ట్ర భవిష్యత్తు పై తీవ్ర ప్రభావం పడుతుందని, సంస్థలు నిర్ధేశించిన సమయంలోనే కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు.

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలు, కల్పిస్తున్న సదుపాయాలపై ప్రతినిధుల బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే అవ కాశం కల్పించినందుకు వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం ఉట్టిపడేలా రూపొందించిన కార్యక్రమాలు రాజధాని అమరావతికి మరింత శోభను ఇస్తాయన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read