అమరావతి బాండ్లకు భారీ డిమాండ్ లభించింది. రూ.1300 కోట్లకు బాండ్లు విడుదల జరగగా బాండ్లకు రూ.2 వేల కోట్లకు పైగా డిమాండ్ వచ్చింది. మరో రూ.700 కోట్ల విలువైన బాండ్లు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక గంటలోనే రూ.2వేల కోట్ల బాండ్ల అమ్మకం జరగడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన సలహాతోనే అమరావతి బాండ్లను స్టాక్‌మార్కెట్‌లో ప్రవేశపెట్టారు . సీఎం చంద్రబాబు సమర్థతకు నిదర్శనమే అమరావతి బాండ్లకు భారీ డిమాండ్ అని స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా మున్సిపల్ బాండ్లలో ఓ స్థానిక నగరాభివృద్ధి సంస్థ జారీ చేసిన బాండ్లకు ఈ స్థాయిలో ఆనూహ్య స్పందన రావటం ఇదే తొలిసారని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ట్రేడ్ వర్గాలు కూడా, ఈ స్పందన చూసి ఆశ్చర్యపోతున్నాయి. అమరావతి ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న నగరమని, ఇలాంటి పరిస్థితితిలో, అమరావతి బాండ్స్ ఇంతలా అమ్ముడు పోయాయి అంటే, అది చంద్రబాబుకు ఉన్న క్రేజ్ మాత్రమే అని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ, మళ్ళీ చంద్రబాబు వస్తారు అనే నమ్మకం ఉండబట్టే, ఈ బాండ్లు గంటలోనే అయిపోయాయి అని అంటున్నారు. ఇవి ఆంధ్రప్రదేశ్ బాండ్లు అయినా, జగన్ వస్తే, అమరావతిని రాజధానిగా మార్చేస్తారనే ప్రచారం బలంగా ఉంది. అయినా సరే, చంద్రబాబె మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో వస్తారానే నమ్మకం ఉండబట్టే, గంటలోనే ఈ బాండ్లు కొనేసారు.
తొలివిడతగా 1300 కోట్ల రూపాయలకు సీఆర్డీఏ బాండ్లను విడుదల చేసింది. అనూహ్యంగా గంట వ్యవధిలోనే 1.5 రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయిన అమరావతి బాండ్లు 2వేల కోట్ల రూపాయల మార్కెట్‌ను సృష్టించాయి. తొలి బిడ్‌లో 600 బాండ్లను సంస్థాగత మదుపరులు దక్కించుకున్నారు. అనంతరం గంట వ్యవధిలో అన్ని బాండ్లనూ దక్కించుకునేందుకు మదుపరులు పోటీ పడ్డారు. దీంతో బాండ్లు ఒకటిన్నర రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయినట్లు బోంబే స్టాక్ ఎక్చ్సేంజీలో నమోదైంది. ఇప్పటివరకూ దేశంలోని మున్సిపాలిటీలు జారీ చేసిన మొత్తం బాండ్ల విలువ 1800 కోట్ల రూపాయలైతే.. ఒక్క సీఆర్డీఏ గంట వ్యవధిలోనే బాండ్ల ద్వారా 2వేల కోట్ల రూపాయల నిధుల్ని సేకరించగలిగిందని అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన సలహాతోనే అమరావతి బాండ్లను స్టాక్‌మార్కెట్‌లో ప్రవేశపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో రిటైల్ బాండ్లను కూడా ప్రవేశపెడతామని పేర్కొన్నారు.