యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్‌ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు మధ్యలో ఉన్న వంట చేసే బోగీ నుంచి ఒక్కసారిగా మంటలు రావటంతో పక్కబోగీలో ఉన్న ప్రయాణికులు చైన్‌ లాగి రైల్‌ను నిలిపివేశారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు రెండు బోగీలను తప్పించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో వంట చేసే బోగీ పూర్తిగా కాలిపోయింది. దీని పక్కన ఉన్న బోగీ కూడా పాక్షికంగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో రైల్వే సిబ్బంది ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు.

train 05032019 2

రైలు ప్రమాదంతో ఒకే లైన్‌ ద్వారా అధికారులు రైళ్ల రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రం చేరేందుకు సరైన మార్గం లేకపోవటంతో మంటలు ఆర్పేందుకు ఆలస్యమైందని సిబ్బంది పేర్కొన్నారు. సుమారు 2.15 గంటల సమయంలో రైల్లోని ప్యాంట్రీకారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. రైలులో మొత్తం 23 బోగీలు ఉండగా 9వ బోగీ అయిన పాంట్రీకార్ మంటలు వచ్చాయి. వీటిని గుర్తించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగారు. ఆపై రైల్వే సిబ్బంది కూడా బోగీలను వేరుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులంతా క్షేమంగా భయటపడ్డారు. అగ్నిప్రమాదంతో విజయవాడ-విశాఖ మధ్య పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read