విజయవాడ బెంజిసర్కిల్ వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ కు రోడ్డు మధ్యలో ఉన్న చెట్ల అడ్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఫ్లై ఓవర్ పనులు మొదలుపెట్టినప్పుడు వీటిని నరికేస్తుండటం పై ప్రజల్లో వ్యతిరేకత ఎదురైంది. అప్పుడు విషయం తెలుసుకుని, దీని పై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇష్టం వచ్చినట్టు చెట్లు నరకకుండా, ట్రీ ట్రాన్స్ లొకేషన్ విధానంలో చెట్లను తరలించాలని అధికారులను ఆదేశించారు.. దీంతో రంగంలోకి దిగిన అధికారాలు ఆ పరిజ్ఞానాన్ని అనుసరించి చెట్లను జాగ్రత్తగా వేళ్లతో సహా పెకలించి మరో చోట నాటుతున్నారు.
ఈ పరిజ్ఞానంలో ఏళ్లుగా పెరుగుతూ ఉన్న పెద్ద వృక్షాన్ని వేర్లు, మట్టితో సహా వెలికితీసి ప్రత్యేక యంత్రం సాయంతో ఖాళీ ప్రదేశంలో నాటుతారు. ముందుగా చెట్టు సైజును బట్టి చుటూ మొదలుకు కొంత దూరంలో మూడు నుంచి నాలుగు మీటర్ల లోతులో గుంతను తవ్వతారు. ఇలా తవ్వాక మట్టి, వేర్ల చుటూ పాలిథిన్ కవర్ చుట్టి ఉంచుతారు. ఈ సమయంలో వేర్లకు కావాల్చిన తేమను అందిస్తారు. ప్రత్యేక యంత్రం సాయంతో ఆ చెట్టును వేర్లతో సహా ఎత్తి ఏదైనా వాహనంలో నాటాలనుకున్న ప్రదేశానికి తరలిస్తారు. అక్కడ ముందే చేసిన గుంతలో ఈ చెట్టును అమర్చి పాలిథిన్ కవర్ను తీసేస్తారు. ఇక ఆ చెట్టు మళ్లీ ఎదగటం ప్రారంభిస్తుంది.
చిన్న చిన్న చెట్ల సహా పది నుంచి పదిహేనేళ్లుగా ఉన్న మొత్తం 308 చెట్లు ఈ ప్రదేశం నుంచి తరలిస్తున్నారు. ముందుగా ఈ పరిజ్ఞానాన్ని గుజరాత్ లో వినియోగించగా అక్కడ విజయవంతమైంది. తర్వాత మన రాష్ట్రంలోనూ పలు చోట్ల చేపట్టారు. ఫలితాలు బాగుండటంతో ప్రస్తుతం నగరంలోనూ ట్రీ ప్లాంటేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్ప టికే చాలా వరకూ చెట్ల మొదళ్ల వద్ద వేర్ల వరకూ తవ్వి పాలిథిన్ కవర్లు కట్టి ఉంచారు. వీటిని సితార జంక్షన్ తదితర ప్రాంతాల్లో తరలిస్తున్నారు... ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది... ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో, ప్రజలు ముఖ్యమంత్రిని అభినందిస్తున్నారు...