ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ట్రెజరీ ఉద్యోగుల నుంచి షాక్ తగిలింది. ట్రెజరీ ఉద్యోగులు అందరూ కూడా, ఆర్ధిక శాఖ అధికారుల ఆదేశాలు పాటించేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి షాక్ ఇచ్చారని చెప్పవచ్చు. అయితే దీనికి గల కారాణాలు చూస్తే, కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జరీ చేసింది. ఈ రోజు ఉదయం రాష్ట్ర ఆర్ధిక శాఖ ఉన్నాతధికారులు అంతా కూడా, ట్రెజరీ అధికారులకు, అదే విధంగా డిస్ట్రిక్ట్ డ్రాయింగ్ ఆఫీసర్స్, వీరి అందరికీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి, కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వటానికి రెడీ అవ్వాలని, గతంలో ఏదైతే ఐఆర్ 27 శాతం ఇచ్చే వారో, ఇప్పుడు దాన్ని 23 శాతానికి తగ్గించటం, అలాగే hraలో కోత విధించటం, అలాగే ఉద్యోగులకు, 2019 జూలై నుంచి ఇచ్చిన ఐఆర్ అలాగే 2020 ఏప్రిల్ వరకు ఇచ్చిన పీఆర్సీ మానిటరీ బెనిఫిట్ వరకు ఇచ్చిన ఐఆర్ ని, డీఏ ఎరియర్స్ లో మినాహించటం, అలాగే పెన్షనర్స్ కి, అడిషినల్ క్వాంటం అఫ్ పెన్షన్స్ వీటి అన్నిటినీ తీసి వేసి, కొత్త సాఫ్ట్ వేర్ ని రూపొందించారు. ఈ సాఫ్ట్వేర్ ప్రకారం, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని, కొత్త బిల్లులు అప్లోడ్ చేయాలని, ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే, ఉద్యోగులు అంతా కూడా, రేపు సమ్మె నోటీస్ ఇవ్వటానికి రెడీ అవుతున్నారు.
మరో వైపు విజయవాడలో ఒక హోటల్ లో, నాలుగు ఉద్యోగ సంఘాల నేతలు అంతా కూడా రహస్యంగా భేటీ నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో ఐక్య పోరాటానికి రూపకల్పన చేస్తున్నారు. ఇదే సందర్భంలో కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వేయాలని, ఉద్యోగుల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా, వారికి జీతాలు వేయాలని, అలా చేసి జీతాలు పడితే, పీఆర్సీ వాళ్ళు అంగీకరించినట్టు అవుతుందని ప్రభుత్వం ప్లాన్ వేసింది. ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వం కొత్త పీఆర్సీ ఏర్పాటు చేసిన తరువాత, ఒక ప్రాసెస్ ఉంటుంది. కొత్త పీఆర్సీ మీకు ఇష్టమా లేదా అనేది అంగీకారం ఇవ్వాలి, ఆ అంగీకారం లేకుండా జీతాలు వేసేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ట్రెజరీ ఉద్యోగులకు దీనికి సంబంధించి ఆదేశాలు వెళ్ళాయి. అయితే ట్రెజరీ ఉద్యోగులు, ప్రభుత్వం ప్లాన్ పసిగట్టి, ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. ట్రెజరీ ఉద్యోగులు తాము ఈ పని చేయం అని, తాము అధికారుల ఆదేశాలు తాము ప్రాసెస్ చేయం అని, అవి పక్కన పడేసారు. దీంతో ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలింది.