దేశవ్యాప్తంగా పర్యటనలతో తెలుగు రాష్ట్రాల సీఎంలు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయి రాజకీయాల్లో మార్పు కోసం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 23న ఫలితాల నేపథ్యంలో అంతటా ఉత్కంఠత నెలకొంది. ఇదిలా ఉంటే సీఈసీతో సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ కలిసి వచ్చినా పనిచేస్తారా అంటే ఆయన తనదైన శైలిలో జవాబిచ్చారు. మరీ ఊహాత్మక ప్రశ్నలు వద్దని మీడియాకు సూచించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా కలుస్తాం. ఒక పార్టీపై వివక్ష చూపించాల్సిన అవసరం లేదన్నారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరాను కలిసి చంద్రగిరి రీపోలింగ్ అంశంపై చంద్రబాబు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

cbnquestion 17052019

ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించారు. తొలుత చంద్రగిరిలో రీపోలింగ్‌ వ్యవహారంపై రాసిన లేఖను సీఈసీకి అందజేశారు. తొమ్మిది కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలంటూ గతంలో తామిచ్చిన ఫిర్యాదును ఈసీ పట్టించుకోలేదని ఆరోపించారు. భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు ఏకపక్షంగా, వివాదాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈసీ పని తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలపాల్సి రావడం చాలా దురదృష్టకరమని సీఎం వ్యాఖ్యానించారు. ఏపీలో ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఆదేశాలు ఎలా జారీ చేస్తారని నిలదీసినట్టు సీఎం మీడియాకు వివరించారు.

cbnquestion 17052019

సాధారణంగా ఎన్నికలు జరిగిన మరుసటి రోజు రిటర్నింగ్‌ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా రీపోలింగ్‌ జరుపుతారని.. కానీ సుమారు నెల రోజులు దాటినప్పటికీ ఏపీలో వైకాపా ఫిర్యాదు మేరకు ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఎలా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. మోదీ, అమిత్‌షా చెప్పిన ప్రకారమే ఈసీ నడుచుకుంటోందన్నారు. 24 ఏళ్లుగా తాను తెదేపా అధ్యక్షుడిగా ఉన్నానని, జాతీయ రాజకీయాలను చూశానన్న ఆయన ఈ విధమైన ఎన్నికల సంఘాన్ని మాత్రం ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వైకాపా ఫారం -7 పత్రాలు ఇష్టానుసారంగా దాఖలు చేస్తే నిందితుల ఐపీ అడ్రస్‌లు ఇవ్వాలని కోరినా ఇప్పటికీ స్పందించలేదని మండిపడ్డారు. జాతిపిత మహాత్మా గాంధీని అవమానపరిచేలా భోపాల్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యలు చేస్తే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read