శ్రీ వారి పింక్ డైమెండ్ పోయింది అని, అది జెనీవాలో ఇటీవల వేలం వేశారని, 500 కోట్లకు అమ్ముడు పోయింది అంటూ, రమణ దీక్షితులు గారు, ఆయనకు బాకా కొడుతూ బీజేపీ, వైసీపీ, జనసేన నేతలు ఎలా విష ప్రచారం చేస్తున్నారో చూస్తున్నాం.... చంద్రబాబు పై నిత్యం విషం చిమ్మే జగన్ పత్రిక దాని, ఆంధ్ర బ్య్యూరో, వాళ్ళు అది జెనీవాలో అమ్ముడు పోని వజ్రమేనా, ఈ దీక్షితులు చెప్తున్న వజ్రం అని వార్తలు రాసారు. ఇక అది పట్టుకుని, బీహార్, చింతలబస్తీ బ్యాచ్ సోషల్ మీడియాలో ఒకటే హడావిడి... అయితే, ఇది అవాస్తవం అని తేలింది.. ఆధారాలుతో సహా, బయట పెట్టారు...

diamond 22052018 2

ఆ జెనీవా వజ్రం గురించి అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్, ఒక ఆర్టికల్ రాసింది... జెనీవాలో అమ్మకానికి పెట్టిన 37.30 క్యారెట్ పింక్ వజ్రం (రాజ్-పింక్) 2015 సంవత్సరంలో ఆఫ్రికాలో దొరికింది.. ముడి వజ్రం చాలా పెద్దది. దాదాపు ఒక సంవత్సరం పాటు విశ్లేషణ చేసి సాన పెట్టి , అంగుళీయ రూపంలో వేలం ద్వారా అమ్మకానికి పెట్టారు. ప్రపంచ విఖ్యాత వేలం సంస్థ సోతెబీ‌స్ ద్వారా యీ అమ్మకం ప్రక్రియ జెనీవాలో జరిగింది. సరియైన పాటదారు రాక వేలంలో అమ్ముడు పోలేదు... అమ్మకందారు ఇరవై నుండి ముప్పై మిలియన్ అమెరికన్ డాలర్ల ధర వస్తుందని ఆశించాడు. ఆ ధర రాకపోవడంతో అమ్మకం జరుగలేదు. 14 మిలియన్ అమెరికన్ డాలర్ల ధర్ మాత్రమే వచ్చింది.. ఆ పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు https://af.reuters.com/article/worldNews/idAFKBN1DF30H

diamond 22052018 3

2015 లో ఆఫ్రికాలో దొరికిన ముడి వజ్రం సానపెట్టబడిన తర్వాత 2017 సంవత్సరంలో అమ్మకానికి వచ్చింది... 2015లో ఆఫ్రికాలో దొరికిన వజ్రం, అది దశాబ్దాల క్రితం మైసూర్ మహారాజా గారు వెంకన్న స్వామికి ఇచ్చిన కెంపు, మన దీక్షితులు గారికి, సాక్షి లాంటి విషం చిమ్మే చానల్స్ కు రూపాంతరం చెంది, వజ్రంగా మారి 500 కోట్ల రూపాయలకు ఎలా అమ్ముడు పోయిందో ? ఏడుకొండల వాడా వెంకట"రమణా" గోవిందా గోవిందా, నీ వస్తువుల గురించే అసత్యాలాడే వారు ఏమౌతారో ? నువ్వే చూసుకోవాలి స్వామీ...

Advertisements

Advertisements

Latest Articles

Most Read