ఆడి కారు, బంగళా, కమర్షియల్ కాంప్లెక్స్ లు, ఇవన్నీ వంశపారంపర్యంగా వారి కుటుంబం వేరే ఉద్యోగ, వ్యాపారాలు వంటి వృత్తులు ఏవీ లేకుండా, కేవలం స్వామి వారికి సేవ చేస్తేనే వచ్చేసిన ఆస్తులా ఇవి ? ఇవి రమణ దీక్షితుల పై తిరుమల అర్చుకులు సంధిస్తున్న ప్రశ్నలు... ఆయన తన ఉనికి కాపాడుకోవడానికి అర్చకులతో పాటు అధికారులను, చివరకు సీఎంను కూడా బ్లాక్‌మెయిల్‌ చేసే స్థితికి చేరారన్నారని విమర్శించారు. రమణ దీక్షితులు పై ఉన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. విధులకు సరిగా హాజరుకాని ఆయన ఇద్దరి కుమారులకు నోటీసులు ఇచ్చినప్పటి నుంచే టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రిటైరవుతానని తెలిసే ఆలయంలో అపచారం జరుగుతోందని, ఆభరణాలు పోయాయని, వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చేశారని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

tirumala 21052018 2

‘వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చేనాటికి రమణదీక్షితులే ఆగమసలహాదారుడిగా ఉన్నారు. ఆయన సంతకంతోనే ఆ ప్రక్రియ జరిగింది. వెయ్యికాళ్ల మండపానికి ఆలయంతో సంబంధం లేదని ఆయన స్వయంగా దేవస్థానానికి అంగీకారం తెలిపాకే కూల్చివేత జరిగింది’ అని తెలిపారు. 2001లో రెండు పోటులకు సంప్రోక్షణ చేసిన సమయంలో వేరే ప్రాంతంలో ప్రసాదాల తయారీకి రమణదీక్షితులే అంగీకరించారన్నారు. వీటికి సంబంధించి ఆ లెటర్లు బయట పెట్టారు. బ్రాహ్మణుల్లో విభేదాలు సృష్టిస్తున్నారు. రమణదీక్షితులు కొడుకులే బ్రాహ్మణులైనట్లు.. మిగిలినవారు మిరాశీ కుటుంబానికి చెందినవారు కాదనేలా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఆలయాన్ని పురావస్తు విభాగానికి ఇవ్వమనేందుకు రమణదీక్షితులు ఎవరని నిలదీశారు. పాతికేళ్లుగా ఆయన ఆధ్వర్యంలోనే అన్నీ జరిగాయని, ఒకవేళ తప్పు జరిగి ఉంటే ఆయనే బాధ్యుడని స్పష్టం చేశారు.

tirumala 21052018 3

తామంతా పూజా కైంకర్యాలు నెరవేరుస్తుంటే రమణదీక్షితులు సెంటుకొట్టుకుని.. ఆడి కారులో వచ్చి పువ్వులతో ఆలయ ప్రవేశం చేసేవారని.. పువ్వులను తోమాల సేవలోనే సమర్పించాలన్నారు. అర్చకుడిగా ఉంటూ ఆడి కారులో రావడం ఏమిటని ప్రశ్నించారు. కైంకర్యాల్లో లోపం, అపచారం లేవని సంభావన అర్చకుడు ఖాద్రిపతి నరసింహాచార్యులు కూడా తెలిపారు. వజ్రం 2001లో పోతే 2018 వరకు రమణదీక్షితులు ఎందుకు బయటపెట్టలేదు? తిరువాభరణ రిజిస్టరులో కూడా వజ్రమని రికార్డు చేయలేదు. అసలది వజ్రం కాదు. కెంపు మాత్రమే. అయినా 2001లో గరుడసేవలో రమణదీక్షితులే వాహనంలో ఉన్నారు. ఆ సమయంలో కెంపు పగిలింది. పగిలిన ముక్కలను అప్పుడే సేకరించారు’ అని వెల్లడించారు. అగ్నిప్రమాదాలు జరగకుండా ఆగమ సలహాదారుల అంగీకారంతో పోటులో మరమ్మతులు చేశారని ప్రధాన అర్చకుడు శేషాచల దీక్షితులు తెలిపారు. 32 మంది సంభావన అర్చకుల సర్వీసును క్రమబద్ధీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అర్చకస్వాములు ధన్యవాదాలు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read