టీటీడీ వివాదంలో రాష్ట్ర అధికారులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ వివాదంలో సీఎస్ తనకు చెప్పకుండానే కమిటీ వేశారని ఫైర్ అయ్యారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులే సొంతంగా కమిటీలు ఎలా వేస్తారని సీఎం ప్రశ్నించారు. కమిటీ వేసి రాటిఫికేషన్ కోసం తనకు పంపారని, రాటిఫికేషన్ చేయడానికే తాను ఉన్నానా? అంటూ నిప్పులు చెరిగారు. టీటీడీ విషయంలో తప్పు చేయని ఈవోను సీఎస్ ఎలా తప్పు పడతారని ప్రశ్నించారు. టీటీడీ బంగారం తరలింపులో లోపాలు ఉన్నాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం కొద్ది రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే.

game 27032019

బంగారం తరలింపు వ్యవహరంలో టీటీడీ అధికారులు, బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన అబిప్రాయపడ్డారు. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన బంగారం తరలింపు వ్యవహారంలో టీటీడీకి ఎన్నికల సంఘం క్లీన్‌చీట్ ఇచ్చింది. ఈ విషయంలో పంజాబ్ నేషలన్ బ్యాంక్ తప్పు లేదని ఈసీ తేల్చింది. ప్రత్యేక పరిస్ధితుల దృష్ట్యానే బంగారాన్ని సీజ్ చేశామని తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కిందిస్థాయి సిబ్బంది బంగారాన్ని సీజ్ చేశారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు రోజు కావడంతో బంగారాన్ని సీజ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్, ఐటీ శాఖ అధికారులతో తనిఖీలు నిర్వహించామన్నారు. అన్ని పత్రాలు సరిచూసుకుని బంగారాన్ని విడుదల చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

game 27032019

శబరిమల అయ్యప్పస్వామి ఆలయం మాదిరిగానే టీటీడీని వివాదస్పదం చేయాలని బీజేపీ కుట్రలు పన్నుతోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గురజాల మాల్యాద్రి ఆరోపించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘శ్రీవారి బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడం ఎప్పటి నుంచో ఉంది. టీటీడీని కూడా సీఎస్‌ ద్వారా మోదీ తన చేతిలోకి తీసుకున్నారు. సీఎస్‌ ద్వారా పాలన సాగిస్తున్న వాళ్లు.. స్వామి వారి నగలు పోయాయని చేస్తున్న ఆరోపణలకు వాళ్లే సమాధానం చెప్పాలి. చంద్రబాబు పాలనలోనే తిరుమల అభివృద్ధి జరిగింది. ఎప్పుడూ ఎటువంటి ఆభరణాలూ చోరీ కాలేదు. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు వజ్రాలు పోయాయి. తాళిబొట్ల కుంభకోణం జరిగింది. శ్రీవేంకటేశ్వరుడికి ఏడు కొండలు కాదు.. రెండు కొండలేనని జీవో తెచ్చారు’ అని ధ్వజమెత్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read