గత రెండు రోజులుగా టిటిడిలో పెను మార్పులు జరిగాయి. గత శుక్రవారం, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులలో ముగ్గురు, జగన్ మోహన్ రెడ్డిని కలిసి, వంశపారంపర హక్కులు పునరుద్దిస్తూ, తమ పిల్లలకు కూడా టిటిడిలో ఉద్యోగాలు ఇవ్వాలని, జగన్ ని కలిసి వేడుకున్నారు. దీంతో వారి పిల్లలను కూడా టిటిడిలో చేర్చుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి, కీర్తిస్తూ, ప్రధాన అర్చకులు జగన్ ని ఆకాశానికి ఎత్తారు. అయితే, గత రెండేళ్ళ నుంచి, పదవీ విరమణ చేసిన తాను, తిరుమలలో రీఎంట్రీ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్న రమణ దీక్షితులకు, ఈ పరిణామం ఆగ్రహం తెప్పించింది. దీంతో గతంలో తనకు ఇచ్చిన హామీ ఏమైంది అంటూ, వైసీపీ నాయకులతో తాడో పేడో తేల్చుకోవటానికి, సంప్రదింపులు జరిపారు. ఈ నేపధ్యంలోనే, ముందుగా ప్రధాన అర్చకుల పిల్లలకు, టిటిడిలో చోటు దక్కుతుంది అని అందరూ అనుకున్న వేళ, తిరుమలలో గత రెండు రోజులుగా కీలక పరిణామాలు జరిగాయి. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని భావించిన టిటిడి, నిన్న రాత్రి ప్రొసీడింగ్స్ ఇచ్చింది. గతంలో 65 ఏళ్ళు దాటిన వారిని తొలగించిన వారిని, మళ్ళీ ఆ పదవిలోనే తిరిగి నియమిస్తూ, ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గతంలో పదవి నుంచి తొలగించిన రమణ దీక్షితులు, మళ్ళీ ప్రధాన అర్చకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నారు.

ttd 03042021 2

రెండేళ్ళ నుంచి, తనను పక్కన పెట్టినా, ఎట్టకేలకు సాధించారు. అయితే ఈ ఉత్తర్వులతో, ఇప్పుడు తిరుమలలో కొత్త డౌట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ముగ్గురు కొత్తా ప్రధాన అర్చకులుగా రానున్నారు. దీంతో, ఇప్పటికే ప్రధాన అర్చకులుగా ఉన్న వారి పరిస్థితి ఏమిటి ? వారు ప్రధాన అర్చకులుగా ఉంటారా ? రమణ దీక్షితులు ఆధిపత్యం తట్టుకుంటారా అనే చర్చ జరుగుతుంది. అయితే దీని పై ఇప్పుడున్న ప్రధాన అర్చకులు ఎలా స్పందిస్తారు అనే దాని పై చర్చ జరుగుతుంది. ఇక మరో పక్క శ్రీవారి సేవల పై అనేక ఆరోపణలు చేసి, చివరకు శ్రీవారికి సరిగ్గా సేవలు చేయటం లేదు, శ్రీవారి హుండీలో డబ్బులు కూడా వేయొద్దు అని రచ్చ రచ్చ చేసి, రాజకీయాలు చేసి, రాజకీయాల్లో ఒక పావుగా మారిన రమణ దీక్షితులు లాంటి వ్యక్తి, తిరుమల ప్రధాన అర్చకుడిగా వచ్చే అర్హత ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. లేని పింక్ డైమెండ్ పోయిందని, అబద్దాలు చెప్పిన ఈయన, శ్రీవారి ప్రధాన అర్చకుడా, అని వివిధ రాజకీయ పక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read