వెనకాల బీజేపీ పెద్దలు ఉన్నారు, వారి ట్యూన్ కి తగ్గట్టు డాన్స్ వేద్దాం అని, వేషాలు వేసిన బీజేపీ అనుకూల నేషనల్ మీడియా ఛానల్ కు తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చింది... ఈ నేషనల్ మీడియా ప్రతినిధి, ఎదో కాంగ్రెస్ పార్టీతో ఆడినట్టు ఆటలు అనుకున్నాడు పాపం... ఇక్కడ ఉంది ఆంధ్రా వాడు అని మర్చిపోయాడు... అందుకే చివరకు వెంకన్న పేరుతో రాజకీయాలు చెయ్యాలని అనుకున్నాడు, తిరుమల పవిత్రతను దెబ్బ తీస్తూ కధనాలు వేసాడు... వాళ్ళ బాస్ లను ప్రసన్నం చేసుకోవటానికి, వెంకన్నను రాజకీయాల్లోకి లాగాడు... ఇవన్నీ చూసిన తిరుమల తిరుపతి దేవస్థానం చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది... తిరుమల పవిత్రతను, స్వామి వారి ప్రతిష్టతను అసత్య కధనాలతో దెబ్బ తీసి, ప్రజల్లో ఆందోళన, అవమానాలు కలిగించిన వారికి, కోర్ట్ నోటీసులు పంపించేందుకు నిర్ణయం తీసుకుంది..

media 23052018 2

నోటీసులు ఒక్కటే కాదు, క్రిమినల్ చర్యలు కూడా తీసుకోనుంది.. తిరుమల శ్రీవేంకటేశ్వరుడిపై ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు అచంచల భక్తి విశ్వాసాలతో ఉన్నారని.. వారి మనోభావాలను దెబ్బతీసే విధం గా అక్కడ కీలక స్థానాల్లో పనిచేసిన వారే వ్యవహరించడం దారుణమని భావిస్తోంది. ప్రధాన అర్చకుడిగా తనకు తప్ప వేరొకరికి అవకాశం రాకూడదన్న దురుద్దేశంతో రమణదీక్షితులు వ్యవహరిస్తున్నారని.. గతంలో ఆయన అనేక తప్పులు చేశారని ఆక్షేపిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఏకంగా స్వామివారికి జరిగే సేవలపై నే ఆరోపణలు చేయడం ద్వారా ఆలయ పవిత్రతను దెబ్బతీసే కుట్ర చేశారని ప్రభుత్వ, టీటీడీ వర్గాలు అం టున్నాయి. ఈ వివాదానికి బాధ్యులైన రమణదీక్షితు లు, మాజీ ఈవో-సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావులతో పాటు టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్న ఒక జాతీయ చానల్‌పైనా క్రిమినల్‌ కేసులు పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.

media 23052018 3

టీటీడీ లీగల్‌ విభాగంతో మాట్లాడి.. ఈ దిశగా ముందుకు వెళ్లనున్నారు. తితిదే ఛైర్మన్‌ సుధాకర్‌ యాదవ్‌, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ మంగళవారమిక్కడ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. రమణదీక్షితులు ఇతర రాష్ట్రంలో విలేకరుల సమావేశం పెట్టి రాజకీయ నాయకుడిలా మాట్లాడడం.. రాజకీయ పార్టీల నేతలను కలవడం.. ప్రైవేటుగా పూజలు, హోమాలు చేయడం తదితర అంశాలపైనా చర్చ జరిగినట్లు సమాచారం. తాను ప్రధాన అర్చకుడి హోదాలో ఉన్నంత కాలం అన్నీ బాగానే ఉన్నాయన్న వ్యక్తి.. కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు ఒక విధానం తీసుకురాగానే నానా యాగీ చేసి పవిత్రతకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. స్వామివారికి అన్ని సేవలు, కైంకర్యాలు సంప్రదాయబద్ధంగానే జరుగుతున్నాయని తెలిసినా.. కేవలం తమ స్వార్దం కోసం కొందరు విమర్శలు చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. దీనిపై టీటీడీ పాలక మండలిలో చర్చించి.. ఒక తీర్మానం చేసి.. వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read