ప్రధాని మోదీ తిరుమల సందర్శన సందర్భంగా టీటీడీ ఆయనకు ప్రత్యేక బహుమతిని ఇవాబోయి విమర్శలు పాలయ్యింది. శ్రీవారి ఖజానాలోని అత్యంత విలువైన, అరుదైన, పురాతన నాణేలతో ఓ ఙ్ఞాపికను ప్రత్యేకంగా తయారు చేయించారు. దీనిని శ్రీవారి దర్శనం తరువాత ఆయనకు బహుకరించాలని అనుకున్నారు. టిటిడి మ్యూజియంలో 14 వ శతాబ్దం నాటి పురాతన నాణెంతో పాటు పలు రకాల డిజైన్ లోఅతో ఉన్న కొన్ని నమూనాలను పెట్టి ఓ జ్ఞాపిక తయారీకి పురమాయించారు. మామూలుగా ఇలాంటి జ్ఞాపికలు ఎంతటి వారికయినా ఇవ్వడం చాలా అరుదు. అయితే మోడీకి ఈ విషయంలో, టిటిడి అధికారులు అతి వినయం చూపించారు . మ్యూజియంలో ఉండాల్సిన పురాతన నాణెం బయటకు రావటంతో, ఈ విషయం మీడియా ద్వారా బయటకు పొక్కింది. విషయం తెలుసుకుని ప్రజా సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. దీంతో, ఈ ప్రతిపాదనను టిటిడి విరమించుకుంది. స్వామికి మించిన భక్తీ అంటే ఇదేనేమో.
శ్రీలంక నుంచి ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. ఆయనకు తెలుగు రాష్ట్రాల గవర్నరు నరసింహన్, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, చిత్తూరు జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ఈ తర్వాత అక్కడికి దగ్గర్లోనే భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రేణిగుంట విమానాశ్రయంవద్ద ప్రధాని మోదీకి స్వాగతం పలికిన సీఎం జగన్ 2 సార్లు ప్రధాని కాళ్లకు నమస్కరించేందుకు ప్రయత్నించారు. ప్రధాని ఆయనను వారించి భుజంపై తట్టారు.