టీటీడీ పై ఏ చిన్న ఆరోపణలు వచ్చినా, దాన్ని చిలవలు పలవలు చేసి, ప్రతి సందర్భాన్ని చంద్రబాబుకి లింక్ చెయ్యటం అలవాటు అయిపొయింది. తాజాగా, చెన్నైలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో టీటీడీ డిపాజిట్‌ చేసిన 1,381కిలోల బంగారం తమిళనాడులో ఎన్నికల నిఘా అధికారులకు పట్టుబడటం పై దుమారం రేగడంతో సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. బంగారం తరలింపు వెనుక పెద్ద కుంభకోణం ఉందంటూ ఆలయాల పరిరక్షణ పీఠం అధిపతి కమలానంద భారతిస్వామి విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ కుంభకోణానికి టీటీడీ ఉన్నతాధికారులే బాధ్యులని పేర్కొంటూ వారిని పరుష పదజాలంతో నిందిస్తూ తొలుత వీడియో విడుదల చేసిన కమలానంద ఆ తర్వా త తన వ్యాఖ్యలను తానే ఖండిస్తూ మరో వీడియో విడుదల చేశారు.

ttd 22042019

దీంతో ఈ మొత్తం వ్యవహారం పై సోమవారం మీడియా సమావేశం నిర్వహించేందుకు టీటీడీ సమాయత్తమవుతున్నట్టు సమాచారం. బంగారం పట్టుబడటం పై పూర్తిస్థాయి వివరాలు భక్తులకు తెలియజేయటంతో పాటు దీని పై వస్తున్న విమర్శలను ఆ సమావేశంలో ఖండించనున్నారు. శ్రీవారి బంగారం, నగదు తరలింపు నిబంధనల మేరకే జరుగుతుందని, ఎక్కడా అక్రమాలకు తావులేకుండా టీటీడీ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుందని పేర్కొంటున్నారు. మూడేళ్ల క్రితం టీటీడీ తమవద్ద బంగారం డిపాజిట్‌ చేసిందని, ఆ బంగారాన్ని వడ్డీతో సహా తిరిగి టీటీడీకి చేర్చామని ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం లేదని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు అధికారి స్పష్టం చేశారు.

ttd 22042019

సరైన ఎస్కార్ట్‌ లేదని, పత్రాలు లేవ ని చెప్పడం అబద్ధమని, అన్ని జాగ్రత్తలు తీసుకునే బంగారం తరలించినట్లు ఆ అధికారులు వివరించారు. తాము అన్ని జాగ్రత్తలు తీసుకున్న తరువాతే, తరలించామని, అధికారులు పట్టుకోగానే, తగు పత్రాలు చూపించి, ఆ బంగారం విడుదల చేసి, టిటిడికి అప్పగించామని, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు స్పష్టం చేస్తుంది. అయినా, దీని పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అంటున్నారు. అయితే, దీని పై, ఆలయాల పరిరక్షణ పీఠం అధిపతి కమలానంద భారతి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. మొదట టిటిడి అధికారులని టార్గెట్ చేసి, వెంటనే వీడియో డెలీట్ చేసి, మరో వీడియోలో నేను అలా మాట్లాడి తప్పు చేసాను. వేరే పదజాలాన్ని వాడాను. సన్యాసి, పీఠాధిపతిగా నా నుంచి ఎవరూ ఆ భాషను ఎవరూ ఆశించరు అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి, మళ్ళీ తిరుమల పై రచ్చ చేసి, దాన్ని చంద్రబాబుకు అంటగట్టి ఆనందం పొందటానికి, వైసీపీ, బీజేపీ లకు మంచి అవకాసం లభించింది. చూద్దాం, దీంట్లో ఏమి సెల్ఫ్ గోల్ వేసుకుంటారో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read