తిరుమల తిరుమల దేవస్థానం, చెప్పినట్టే చేసింది. తిరుమల పవిత్రతకు, ఆ వెంకన్న స్వామిని, తమ నీఛ రాజకీయాల కోసం అప్రతిష్ట పాలు చేయ్యాలనుకున్న వారికి చెప్పినట్టే, లీగల్ నోటీసులు పంపించింది. తిరుమల పూర్వ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీటీడీ నోటీసులు జారీ చేసింది. టీటీడీపై చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలని దేవస్థానం బోర్డు కోరింది. టీటీడీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ నోటీసులో పేర్కొంది. మరి ఈ లీగల్ నోటీసుకు, ఎలాంటి గరుడ పురాణం చెప్తారో చూడాలి... ఈ ఎపిసోడ్ అంతా ఆపరేషన్ గరుడలో భాగమే అని ప్రభుత్వం కూడా నమ్ముతుంది. అమిత్ షా తిరుమల వెళ్లి వచ్చిన మరుసటి రోజే రమణ దీక్షితులు ఆరోపణలు మొదలు పెట్టటం, వెళ్లి జగన్ ను కలవటం, ఇవన్నీ కుట్ర ప్రకారమే జరుగుతున్నాయి.

tirumala 19032018 2

సాక్షాత్తు కలియుగ దైవం వెంకన్న స్వామినే రాజకీయాల్లోకి లాగి, స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటూ, బీజేపీ నేతలను కలుస్తూ, తిరుమల పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న రమణ దీక్షితుల పై టీటీడీ పాలకమండలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీవారి ఆభరణాలు, కైంకర్యాలు, ఇతర అంశాలపై, నిరాధార ఆరోపణలకు కళ్లెం వేసి తీరాల్సిందేనని నిర్ణయించింది. ఆయనతోపాటు... ఆ ఆరోపణలను సమర్థిస్తూ మాట్లాడిన వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని గత వారం తీర్మానించింది. ‘‘రమణ దీక్షితులు ఆరోపణలపై నివేదికను రూపొందించి న్యాయ నిపుణుల సూచనలు కోరతాం. ఆయనతోపాటు టీటీడీపై విమర్శలు చేసిన వ్యక్తులకూ నోటీసులు జారీ చేస్తాం’’ అని టిటిడి చెప్పినట్టే, చేసింది.

tirumala 19032018 3

దీక్షితులు పై టిటిడి చైర్మన్ సుధాకర్‌ యాదవ్‌ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘24 ఏళ్లుగా స్వామివారికి సేవలందించారు. అప్పుడు లేని అనుమానం ఈ రోజే ఎందుకొచ్చింది? నిజంగా తప్పు జరిగి ఉంటే ఆయన తిరుమలకు వచ్చి మాట్లాడాలి. మేమెక్కడికీ పారిపోలేదు. తప్పు జరిగినట్లయితే మాకు చూపించవచ్చు కదా! మేమూ మీవెంట వస్తాం. ఆలయంలో చూద్దాం రా! అది వదిలేసి హైదరాబాద్‌లో ఒకసారి ఢిల్లీలో ఒకసారి, చెన్నైలో ఒకసారి ఎవరి పోత్సాహంతోనో పూటకో మాట మాట్లాడుతున్నావు? భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నావ్‌! దేవునిపై దుష్ప్రచారం చేస్తున్నావ్‌! ఆ దేవుడే నీకు సరైన గుణపాఠం చెబుతాడు’’ అని హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read