తిరుమల అంటే ప్రతి ఒక్కరకీ ఎంతో పవిత్రమైన స్థలం... ఆ వెంకన్నను దర్శించుకుని, జీవితంలో ముందుకు పోతూ ఉంటాం... సామాన్య భక్తులు గంటలు గంటలు లైన్లలో ఉండి దర్శనం చేసుకోవాలి... నాయకులకు మాత్రం ఎల్-1, ఎల్-2 అని 500 రూపాయలకే టికెట్ ఉండటంతో, వారు ఇష్టం వాచినట్టు, వచ్చినట్టు మందీ మార్బలం వేసుకుని వచ్చి, ప్రధమ ప్రాధాన్యం ఉంది అని దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు... రోజా లాంటి నేతల గొడవలు చూస్తూనే ఉంటాం... ప్రతి వారం శ్రీవారి గుడికి వెళ్ళటం, తనతో పాటు 50 మందికి కూడా ఎల్-1, ఎల్-2 టికెట్లు ఇవ్వాలి అని గొడవ చెయ్యటం... ఇవ్వకపోతే గుడి ముందే ధర్నా చేసి, తిరుమల పవిత్రతను పాడు చెయ్యటం... ఇలాంటి వారితో విసుగెత్తి పోయిన టిటిడి, సంచలన నిర్ణయం తీసుకుని..
శ్రీవారి దర్శనార్ధం ప్రముఖులకు కేటాయించే వీఐపీ దర్శన టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రభుత్వం ఒప్పుకోవటమే తరువాయి... ప్రధమ ప్రాధాన్యం ఎల్-1 టికెట్ ధర 500 నుంచి 5 వేలకు, ద్వితీయ ప్రాధాన్యం ఎల్-2 టికెట్ రూ.500 నుంచి రూ.2వేలకు పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎల్1 టికెట్లకున్న ఒత్తిళ్ల నేపథ్యంలోనే టీటీడీ ఈ నిర్ణయానికి వచ్చింది. ఎల్ 3 టికెట్ ధరను మాత్రం యధాతథంగా ఉంచనున్నారు. ఈ ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన వెంటనే అమలు చేయడానికి టీటీడీ సమాయత్తమవుతోంది.
ఎల్-1, ఎల్-2 టికెట్లకున్న డిమాండు దృష్యా ఐదేళ్లగా ధరలు పెంచే అంశం వాయిదా పడుతూ వస్తుంది. ధర్మకర్తలలో ఉన్న మెజారిటీ సభ్యులు తమకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ధరల పెంపు వాయిదా పడింది. ప్రస్తుతం ధర్మకర్తల మండలి లేకపోవడంతో ఉన్నతాధికారులు వీఐపీ టికెట్ ధరలు పెంచాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆరు నెలలుగా ఎల్-1 టికెట్లను కేవలం ప్రొటోకాల్ వర్తించే ప్రముఖులకు మాత్రమే కేటాయిస్తున్నారు. అప్పటి నుంచి ఎల్-1 టికెట్ల కోసం అధికారుల పై ఒత్తిళ్లు బాగా పెరిగాయి. రోజా లాంటి నేతలు అయితే, మాతో పాటు వచ్చిన అందరికీ ఎల్-1 టిక్కెట్ లు ఇవ్వాల్సిందే అని గొడవ చేసిన విషయాలు కూడా విన్నాం.. ఇక ఇలాంటి వారి ఆటల ఇక సాగవు...