లేని పింక్ డైమెండ్ పోయింది అని... జెనీవాలో 500 కోట్లకు వేలం వేసారని.. ఇలా అనేక ఆరోపణలు చేస్తున్న ఆపరేషన్ గరుడ బ్యాచ్ దిమ్మి తిరిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. శ్రీవేంకటేశ్వర స్వామివారి స్వర్ణాభరణాలను ప్రదర్శించాలని తిరుమల, తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఇందుకు దేవస్థానం ఆగమ సలహామండలి అనుమతి కోరింది. అనుమతిరాగానే భారీ భద్రత కల్పించి భక్తుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే దిశగా ప్రదర్శించాలని సంకల్పించింది. మిరాశీ వ్యవస్థ రద్దయిన అనంతరం ఆలయ అధికారులకు అప్పగించిన ఆభరణాలన్నింటినీ తిరువాభరణం దస్త్రాల్లో నమోదు చేసిన మేరకు ప్రదర్శనకు ఉంచాలని తీర్మానించింది.

tirumala 06062018 2

రుమలలో మంగళవారం ధర్మకర్తల మండలి సమావేశం అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ నేతృత్వంలో జరిగింది. ఈనెల 26న మరోసారి సమావేశమై అధ్యక్షుడితో పాటు సభ్యులు ఆభరణాలు పరిశీలించాలని నిర్ణయించారు. ఇందుకు కూడా ఆగమ సలహామండలి అనుమతి తీసుకోవాలని తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు సూచించారు. తవ్వేసినట్లుగా రమణదీక్షితులు ఆరోపిస్తున్న వకుళామాత పోటును పరిశీలించాలని నిర్ణయించారు. శ్రీవారి ఆలయ పవిత్రత, తితిదే ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వ్యక్తులకు లీగల్‌ నోటీసులు ఇవ్వాలని తీర్మానించారు. నోటీసులు అందుకోనున్న వారిలో రమణదీక్షితులుతో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులు తెలిపారు.

tirumala 06062018 3

మరో పక్క విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పి.బాలసుబ్రమణ్యం , రమణ దీక్షితుల ఆరోపణల పై స్పదించారు. తిరుమల జేఈవోగానే కాదు, నా మొత్తం సర్వీసులో ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే శ్రీవేంకటేశ్వర స్వామివారి సాక్షిగా ప్రాణత్యాగం చేసుకుంటానని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పి.బాలసుబ్రమణ్యం ప్రకటించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులుకు సవాల్‌ విసిరారు. రమణ దీక్షితులు సోమవారం చేసిన ఆరోపణల నేపథ్యంలో బాలసుబ్రహ్మణ్యం మంగళవారం ఇక్కడ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తిరుమల జేఈవోగా తొమ్మిదన్నరేళ్ల పాటు పని చేశానని, వేయికాళ్ల మండపాన్ని తొలగించాలని తాను కోరలేదన్నారు. రోజుకు రూ.50 చొప్పున కూలీ ఇచ్చినట్లు చేసిన ఆరోపణలో ఏమాత్రం వాస్తవంలేదని, సంభావన అర్చకులకు మాత్రమే చెల్లించినట్లు పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read