భక్తులు అభిప్రాయాల మేరకు మహాసంప్రోక్షణ సమయంలో శ్రీవారి దర్శన విధివిధానాలను రూపొందించాలని టీటీడీ సంకల్పించింది. ఇందుకు యాత్రికుల అభిప్రాయం మేరకు నడుచుకోవాలని తలచింది. ఇప్పటికే సలహాలు, సూచనలు స్వీకరించడం ప్రారంభించింది. మహాసంప్రోక్షణకు ఆగస్టు 11న అంకురార్పణ జరగనుంది. 12 నుంచి 16 వరకు మహాసంప్రోక్షణ జరుగుతుంది. ఆ రోజుల్లో స్వామి దర్శనానికి అతి తక్కువ సమయం ఉండడం, ఈ తరుణంలో వేలాదిగా తరలివచ్చే పక్షంలో ఆరు రోజుల పాటు యాత్రికులకు తలెత్తే సమస్యలను అంచనా వేసి టీటీడీ నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు, దేవస్థానం నిర్ణయాలు సరిగ్గా లేవంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి.. టీటీడీకు ఆదేశాలు ఇవ్వడంతో ధర్మకర్తల మండలితో పాటు ఉన్నతాధికారులు దిగివచ్చారు. మహాసంప్రోక్షణ వేళ పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పనపై అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. ఆగమ పండితులు, అర్చకులు నిర్ణయించిన షెడ్యూలు మేరకు పరిశీలిస్తే అంకురార్పణ జరిగే 11వ తేదీన 9 గంటలు, మహాసంప్రోక్షణ ప్రారంభమయ్యే 12న 4 గంటలు, 13న 4, 14న 6, 15న 5, పూర్ణాహుతి జరిగే చివరి రోజు 16న 4 గంటల చొప్పున స్వామివారి మహాలఘు దర్శనానికి సమయం ఉంటుంది. గంటకు 4 వేల మందికి శ్రీవారి దర్శనం కల్పించడానికి వీలవుతుంది.
ఈ సమయంలో ఏ విధానాన్ని అనుసరించి శ్రీవారి దర్శనానికి అనుమతించాలనే విషయమై టీటీడీ అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. మెజార్టీ యాత్రికుల అభిప్రాయం మేరకు ఈనెల 24న టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఈ నెల 23న మధ్యాహ్నం లోపు సలహాలు, సూచనలు అందించాలని విజ్ఞప్తి చేసింది. సలహాలు, సూచనల తెలియజేసేందుకు.. * టీటీడీ కాల్ సెంటర్ నంబర్లు- 0877 2233333, 2277777 * వాట్సాప్ నంబరు- 93993 99399 * టోల్‌ఫ్రీ నంబర్లు- 1800 425 4141, 1800 425 3333 * ఈ-మెయిల్ This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.