అమరావతిలో అసెంబ్లీ ముట్టడి ఉండటంతో, భారీ బందోబస్తు ఉన్న సంగతి తెలిసిందే. ఒక్క పురుగుని కూడా మేము బయటకు వదలం అంటూ, పోలీసులు ప్రకటనలు చేసారు. అడుగడుగునా ఒక పోలీసుని పెట్టరు. మొత్తం 8 వేల మంది పోలీసులని కాపలా పెట్టారు. కొద్ది సేపటి క్రితమే, అటు వైపు నుంచి జగన్ మోహన్ రెడ్డి, ఇతర మంత్రులు, మందడం మీదుగా అసెంబ్లీకి వెళ్లారు. అయితే, ఉన్నట్టు ఉండి, అమరావతి ప్రజలు వ్యూహం మార్చారు. ఒకేసారి దాదాపుగా 3 వేల మంది, బయటకు వచ్చారు. తుళ్ళూరు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒకేసారి అంత మంది రావటంతో, పోలీసులు కూడా షాక్ అయ్యారు. ముఖ్యంగా మహిళలు అధికంగా ఉండటంతో, పోలీసులకు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. క్షణాల్లోనే, పోలీసుల నిర్బంధాలు దాటుకుని, రైతులు, మహిళలు అసెంబ్లీ వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో పోలీసులు ఖంగు తిన్నారు. అంతా కంట్రోల్ లో ఉంది అని భావించిన టైంలో, ఇలా జరగటంతో, ఒక్కసారిగా పోలీసులు అవాక్కయ్యారు.
అయితే ఇక్కడ రైతులు ఎంచుకున్న వ్యూహం చూసి పోలీసులు కూడా షాక్ తిన్నారు. రైతులు, మహిళలు ఒక్కసారిగా బయటకు రావటంతో, పోలీసులు మూడంచెల బధ్రత కూడా పని చెయ్యలేదు. అదే విధంగా, రైతులు అడ్డ దారిలో, ప్రయాణం అవ్వటంతో, పోలీసులకి కూడా ఏమి జరుగుతుందో అర్ధం కావటం లేదు. దాదాపుగా 3 వేల మంది, ఇప్పటికే నేలపాడులో ఉన్న హైకోర్ట్ దాకా చేరుకున్నారు. నేలపాడు పొలాలల్లో నుంచి, వెలగపూడికి చాలా తేలికగా చేరుకోవచ్చు. అన్నీ పొలాలు కావటంతో, పోలేసులకు కూడా ఎటు వైపు నుంచి రావాలో అర్ధం కావటం లేదు. పరిస్థితి ఒక్కసారిగా మారిపోవటంతో, పోలీసులు మిగతా ప్రాంతాల నుంచి, బలగాలను ఇక్కడకు తెప్పిస్తున్నారు.
ఎలాగైనా అసెంబ్లీకి చేరుకొని, రైతుల దమ్ము ఏమిటో జగన్ మోహన్ రెడ్డికి చూపిస్తామని రైతులు అంటుంటే, పోలీసులు మాత్రం, ఎలా అయినా, అడ్డుకుని తీరుతామని అంటున్నారు. ఇక మరో పక్క, ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం సమావేశంలో ఏడు బిల్లు లకు ఆమోదం తెలిపిన క్యాబినెట్ .హై పవార్ కమిటీ నివేదిక కు ఆమోదం తెలిపిన క్యాబినెట్. వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ బిల్లుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి మద్దతు తెలిపేలా అధికార పక్షం కసరత్తు పూర్తి చేసింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర నుంచి నలుగురు ఎమ్మెల్యేల చొప్పున బిల్లుపై సభలో మాట్లాడనున్నారు.