తునిలో రైలు ద‌హ‌నం కేసుని కోర్టు కొట్టేసింది. ర‌త్నాచ‌ల్ ఎక్స్ ప్రెస్ ద‌హ‌నం వెనుక ఎవ‌రున్నారో అంద‌రికీ తెలుసు. కానీ ఈ కేసు ఆధారాలు లేని కార‌ణంగా కోర్టులో కొట్టివేయ‌బ‌డింది. ప్ర‌భుత్వం నుంచి ఈ కేసు విచార‌ణ‌కి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు అంద‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ కేసు పోయింద‌ని న్యాయ‌నిపుణుల విశ్లేష‌ణ‌. వైసీపీ ప్రభుత్వం, ఈ కేసులో ఆధారాలు ఎందుకు ఇవ్వలేక పోయింది? అనేది అంద‌రికీ తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్యం. తుని రైలు ద‌హ‌నం కేసుని కొట్టేస్తూ విజయవాడ రైల్వే కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో 24 మంది సాక్షుల్లో 20 మందిని విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. రైలు దహనం ఘటనలో ముద్రగడ, దాడిశెట్టి రాజా, నటుడు జీవీ సహా 41 మందిపై అప్ప‌ట్లో కేసులు న‌మోదు అయ్యాయి. టిడిపి ప్ర‌భుత్వ హ‌యాంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో ఉద్య‌మం ఆరంభించారు. ఈ ఉద్య‌మం వెనుక వైకాపా ర‌హ‌స్య అజెండా ఉంద‌ని అప్ప‌ట్లో విమ‌ర్శ‌లు వినిపించాయి. దీనికి ఊతం ఇచ్చేలా ఆ త‌రువాత ప‌రిణామాలు స్ప‌ష్టం చేశాయి. 2016 జనవరిలో ఆందోళనకారులు తుని స‌మీపంలో ర‌త్నాచ‌ల్ ఎక్స్ ప్రెస్‌కి నిప్పుపెట్టారు. అప్పట్లో 41 మందిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసు విభాగం, గవర్నమెంట్‌ రైల్వే పోలీసులు నమోదు చేసిన పలు కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఆర్పీఎఫ్‌ కేసు పెండింగ్‌లో ఉంది. రైల్వే చట్టంలోని సెక్షన్లు 146, 147, 153, 174 (ఎ), (సి) కింద అప్పట్లో కేసులు నమోదు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన రైల్వే కోర్టు తాజాగా కేసును కొట్టివేసింది. ఈ కేసులు కొట్టేసినా, ఎత్తేసిన తీరు చూస్తే వైసీపీ హ‌స్తం దీని వెనుక ఉంద‌నేది క్రిస్ట‌ల్ క్లియ‌ర్‌గా తెలిసిపోతోంది. కాపు రిజ‌ర్వేష‌న్లు కోస‌మే ఇదంతా జ‌రిగింద‌నుకోవ‌డానికి ఆస్కార‌మే లేన‌ట్టు, వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కాపు ఉద్య‌మంని ముద్ర‌గ‌డ ఆపేశారు. కాపుల‌కు ఈబీసీ నుంచి 5 శాతం టిడిపి ఇచ్చిన రిజ‌ర్వేష‌న్‌ని వైసీపీ ఎత్తేసినా ముద్ర‌గ‌డ నోరెత్త‌లేదు. రైళ్లు త‌గ‌ల‌బ‌డ‌లేదు. ఈ ప‌రిణామాల‌న్నీ గుదిగుచ్చి చూస్తే వైసీపీ కోసం వైసీపీ చేయించిన పెయిడ్ ఉద్య‌మం అని తేలిపోతోంది. టిడిపిని దింప‌డానికే ర‌త్నాచ‌ల్ త‌గ‌ల‌బెట్ట‌డం, కాపు రిజ‌ర్వేష‌న్ ఉద్య‌మం పేరుతో ముద్ర‌గ‌డ డ్రామా ఆడార‌ని.. టిడిపి ఓట‌మి-వైకాపా గ‌ద్దెనెక్కించే త‌న లక్ష్యం నెర‌వేర‌టంతో కాపు రిజ‌ర్వేష‌న్ ఉద్య‌మాన్ని అట‌కెక్కించేశార‌ని కాపులే తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read