ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైసీపీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. శాసనమండలిలో వైసీపీ పార్టీకి మెజారిటీ లేకపోవటంతో, వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క శాసనసభలో, 151 మందితో, ప్రతిపక్షం పై పడుతుంటే, శాసనమండలిలో మాత్రం, బాగా వెనుకబడి ఉన్నారు. దీనికి కారణం వైసీపీకి శాసనమండలిలో సంఖ్యా బలం లేకపోవటం. 2021 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాసం ఉంది. పూర్తిగా తెలుగుదేశం ఆధిపత్యంతో శాసనమండలి జరుగుతూ ఉండటంతో, వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. శాసనసభలో ఎక్కవ మంది ఉండటంతో, బుల్ డోజ్ చేసి వెళ్లిపోతుంటే, శాసనమండలిలో మాత్రం, సామధానం చెప్పల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు బిల్లులు కూడా పాస్ చేసుకోలేని పరిస్థితిలో వైసీపీ ఉంది. మంగళవారం శాసనమండలిలో రెండు బిల్స్ పాస్ కాలేదు. తెలుగు మీడియం రద్దు చేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్స్ విషయంలో ఇబ్బంది పడ్డారు.
ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదని, తెలుగు మీడియం కూడా ఆప్షన్ పెట్టాలని, అప్పుడే బిల్ కు అనుకూలంగా వోట్ వేస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పింది. అలాగే, ఎస్సీ వర్గీకరణకు వైసీపీ వ్యతిరేకిస్తోందని, బిల్ పై సవరణలు ఒప్పుకోవాలని కోరారు. అయితే, ప్రభుత్వం ఒప్పుకోక పోవటంతో, 34మంది సభ్యులు వ్యతిరేకించగా, అధికారపార్టీకి మద్దతుగా కేవలం 9ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రెండు బిల్లులు వీగిపోయాయి. దీంతో మళ్ళీ ఈ బిల్ అసెంబ్లీకు పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ తిరిగి శాసనసభ సమావేశాల్లో ఈ బిల్లులపై చర్చను చేపట్టాల్సి ఉంటుంది. ఆ తరువాత కూడా శాసనమండలి వ్యతిరేకిస్తే, అసెంబ్లీ తీర్మానం ఫైనల్ అవుతుంది. అయితే ఈ పరిణామాలతో వైసీపీ అవాక్కయింది.
2021 వరకు తెలుగుదేశం పార్టీ, ఇలాగే చేస్తుందని, తమ ఆటలు సాగవని, అందుకే ఇప్పుడు అసలు శాసనమండలి రద్దు చేస్తే ఎలా ఉంటుంది అని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇప్పటికే ఈ దిశగా చర్యలు జరుగుతున్నాయని, ప్రభుత్వం మండలి రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. సమయం చూసుకుని మండలి రద్దు ఉత్తర్వులు ఇస్తారని తెలుస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీగా నారా లోకేష్, డొక్కా, వైవీబీ లాంటి ఎంతో మంది నేతలు శాసనమండలిలో ఉండటంతో, వారిని కూడా రాజకీయంగా ఇబ్బంది పెట్టొచ్చని జగన్ వ్యూహంగా తెలుస్తుంది. అయితే, ఇప్పుడు మంత్రులుగా పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకట రమణ, ఎమ్మెల్సీలుగా మంత్రులు అయ్యారు. మరి వారి సంగతి ఏమిటి అనే చర్చ జరుగుతుంది.