రెండు ఉదాహరణలు... కేవలం రెండే ఉదాహరణలు ... మీడియా సంస్థలు వ్యవహార శైలి...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,ఇక్కడి ప్రజలు,ఇక్కడి ముఖ్యమంత్రి,ఇక్కడి ప్రభుత్వం పట్ల మీడియా వ్యవహరిస్తున్న తీరుని కళ్లకి కట్టినట్టు వివరిస్తుంది. రెండు రాష్ట్రాల్లో ఉన్న మీడియా ఒక్కటే కానీ రెండు రాష్ట్రాల్లో వచ్చే వార్తల్లో ఎంతో వైరుధ్యం ఉంది దీనికి ఉన్న ఉదాహరణలు మీ ముందు ఉంచుతాను. చిత్తూరు జిల్లా ఏర్పేడు లారీ ఘటన ... లారీ ఢీ కొట్టి 15 మంది చనిపోతే మీడియా లో అనేక వార్తలు వచ్చాయి...బ్రేకింగ్స్ వచ్చాయి. ప్రభుత్వ ఘోర వైఫల్యం ,చంద్రబాబు తప్పిదం,ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాలి ... గాఢ నిద్ర లో ప్రభుత్వం ... 15 మందిని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వం అని వార్తలు ప్రపంచ ఎల్లలు దాటాయి... జాతీయ మీడియాలో సైతం ఇవే వార్తలు..కొన్ని మీడియా సంస్థలు అయితే మంత్రి రాజీనామా చెయ్యాలి,ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలి అని వార్తలు రాసాయి...

సరే లారీ ఢీ కొట్టడానికి చంద్రబాబే కారణం అనుకుందాం...దానికి ఒక ముఖ్యమంత్రి గా బాధ్యత వహించి హుటాహుటిన ప్రభుత్వ యంత్రాగాన్ని,మంత్రులను పంపి క్షతగాత్రులను ఆసుపత్రులకు పంపడం,మెరుగైన వైద్య సేవలు అందించడం...చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడం చేసారు...చివరి బాధితుడికి న్యాయం జరిగే వరకూ చంద్రబాబు ని వదిలేది లేదు అని మీడియా అనుకోవడం లో నిజానికి తప్పుకూడా లేదు ... తెలంగాణ లో కొండగట్టు వ్యవహారం... కొండగట్టు బస్సు ప్రమాదం ...58 మంది భక్తులు ఘోరంగా చనిపోయారు...మరి తెలంగాణ లో మీడియా రూల్స్ ఎందుకు మారాయి...తెలంగాణ లో బస్సు ప్రమాదం జరిగి 58 చనిపోయి మిగిలిన కొంత మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే...మీడియా లో వచ్చిన వార్తలు ఏంటో తెలుసా...ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం... కోసం వెళ్లి అనంత లోకాలకు... కనీసం చనిపోయిన వాళ్ల కుటుంబాలను పరామర్శించిన వాడు లేడు.

వాళ్లకి సహాయం చేసిన వాడు లేడు...మన మీడియా కి ఇది ప్రభుత్వ వైఫల్యం గా కనపడలేదు...చివరి బాధితుడి న్యాయం జరిగే వరకూ ఇక్కడ మీడియా పోరాటం లేదు. ఇక రెండో విషయం రెండు రాష్ట్రాలను ఊపేసిన విషయం డేటా చోరీ కేసు . అసలు ఈ కేసు గురించి మీడియా ఎందుకు అంత రాద్ధాంతం చేసింది ? ఆంద్రప్రదేశ్ కి సంబందించిన డేటా పోయింది అది మేము వెతుకుతున్నాం అని తెలంగాణ పోలీసులు అనడం ఏంటి ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,ఎన్నికల సంఘం,ఆధార్ అధారిటీ డేటా పోయింది అని తెలంగాణ పోలీసులు చెప్పడం... బాబు మా డేటా మా దగ్గరే ఉంది మా డేటా పోలేదు అని చెబుతున్నా మీడియా లో వస్తున్న వార్తలు చూసి ఆశ్చర్యం వేస్తుంది...మొదట ఏపీ ప్రజలు డేటా కొట్టేసిన చంద్రబాబు,రెండు తెలంగాణ డేటా కొట్టేసిన చంద్రబాబు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఇతర రాష్ట్రాల డేటా కొట్టేసిన చంద్రబాబు అని మీడియా లో వార్తలు... అసలు ఎం పోయిందో తెలియదు?ఎం వెతుకుతున్నారో తెలియదు? 

Advertisements

Advertisements

Latest Articles

Most Read