కృష్ణా నదిలో ఉన్న దీవుల అభివృద్ధికి ఆసక్తి కనబర్చిన యూఏఈ కి చెందిన బీఎల్ఎఫ్ సంస్థ రెండు దీవుల అభివృద్ధికి సీఆర్‌డీఏతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ యూఏఈ లో అక్కడి ఆర్ధిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న బిజినెస్ లీడర్స్ ఫోరమ్ (బీఎల్ఎఫ్). కృష్ణానదిలో ఉన్న 14 దీవుల్లో ఏడు దీవులు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఈ రెండు ఐలాండ్ లను బీఎల్ఎఫ్ ప్రతినిధులు పరిశీలించారు.

uae 16082018 2

దాదాపు 500 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్, కన్వెన్షన్ సెంటర్, రిక్రియేషన్ విల్లాలు నిర్మించడానికి యూఏఈ సంస్థ ముందుకు వచ్చింది. ప్రాజెక్ట్ పూర్తిగా ప్రారంభించే ముందు పర్యావరణ అంశాలను కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత మూడు నెలల్లో ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. చంద్రబాబు అక్టోబర్ 2017లో దుబాయ్ పర్యటన చేసిన సందర్భంలో, బిజినెస్ లీడర్స్ ఫోరమ్ తో సమావేశం అయ్యారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్రాజెక్టుతో నవ్యాంధ్రకు రావాలని, పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి మేరకు, వారు అధ్యయనం చేసి, వచ్చారు.

uae 16082018 3

ఇప్పటికే భవానీ ఐల్యాండ్ ను దాదాపుగా రూ. 4 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. భవానీ ద్వీపాన్ని ఓ ఫిలిం సిటీ లాగ అభివృద్ధి చేయటానికి అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్యూటిఫికేషన్ చేపడుతున్నారు. చూడ చక్కటి ఆర్కిటెక్ట్, అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్స్ ఆవిష్క రించే ప్రతిపాదనలు చేయనున్నారు. వీటితో పాటు భవానీ ద్వీపాన్ని సింగపూర్ లోని సెంతోసా తరహాలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సెంతోసాను మించి ఏ విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేయవచ్చన్న దాని పై తగిన ప్రణాలికలను నిర్దేశించనుంది. పర్యాటకం, ఆనందం, ఉత్కంఠ, వినోదం, ఆహ్లాదం, ఆటవిడుపు, ఆహారం వంటి అంశాలతో సుందరీకరించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read