ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పనులలో రెండు గిన్నిస్ రికార్డులను నమోదు అయ్యాయి. గతంలో చేపట్టిన 21,580 క్యూబిక్ మీటర్ల పనులను 16 గంటలలో అధిగమించిన నిర్మాణ సంస్థ 24 గంటలలో 32,315 క్యూబిక్ మీటర్ల పనులను పూర్తి చేసినట్లుగా గిన్నిస్ బుక్ అధికారులు ప్రకటించారు. పోలవరం స్పిల్‌వే కాంక్రీట్ ఫిల్లింగ్ పనులు నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమై ఈరోజు ఉదయం 8 గంటల వరకు కొనసాగింది. ఉదయం 8-9 గంటల మధ్యలో 1275 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు. 9-10 మధ్య 1340 క్యూబిక్ మీటర్లు, 10-11 గంటల మధ్య 1380 క్యూబిక్ మీటర్లు, 11-12 మధ్య 1420 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ వేశారు. 5వ గంటల్లో మొత్తం 6,797 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయడం గమనార్హం. గిన్నిస్ బుక్ రికార్డు సృష్టిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్ట్ ఏజెన్సీ ఈ భారీ సవాల్‌ను స్వీకరించాయి. ఇప్పటికే 24 గంటల్లో 11,154 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిచేసి జాతీయ రికార్డును నెలకొల్పిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ఈసారి ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించింది.
ఈసారి 24 గంటల్లో 32 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి, గిన్నిస్ బుక్ రికార్డ్ సృష్టించింది. గిన్నిస్ బుక్ ప్రతినిధి విశ్వనాధ్ ఆదివారం పనులను దగ్గరుండి పరిశీలించి నమోదు చేశారు. ఇప్పటి వరకు దుబాయ్‌లో నమోదైన రికార్డును పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా 24 గంటల్లో 32వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి రికార్డ్ బద్దలు కొట్టారు. కాగా స్పిల్ చానల్‌లో జరుగుతున్న ఈ పనులను గిన్నిస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డుకు చెందిన 24మంది నిపుణులు పర్యవీక్షించారు. దుబాయ్‌లో ఒక టవర్ నిర్మాణానికి 2017 మేలో 36 గంటల్లో 21,580 ఘనపు మీటర్ల కాంక్రీీట్ వేశారు. ఇప్పుడా ఆ రికార్డును పోలవరం అధిగమించింది. ప్రాజెక్టులో 3 నెలల కిందట 24 గంటల్లో 11,158 ఘనపు మీటర్ల కాంక్రీట్ వేశారు. మళ్లి గత నెలలో 11,289 ఘనపు మీటర్ల కాంక్రీట్ వేసి, పాత రికార్డును అధిగమించారు. ఇప్పుడు ఏకంగా 32వేల ఘనపు మీటర్ల కాంక్రీట్ వేసి,ప్రపంచ రికార్డు సాధించారు.
ప్రతి 15 నిమిషాలకొకసారి కాంక్రీట్ ఎంత వేసింది గిన్నిస్ బుక్ ప్రతినిధులు రికార్డు చేశారు. ప్రతి గంటకు సగటున 1360 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఫిల్లింగ్ పనులు చేయగా రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుగులో అధునాతన యంత్రాలతో కార్మికులు బ్లాకుల్లో కాంక్రీట్ పనులు జరిగాయి. నీటిపారుదల, నవయుగ ప్రతినిధుల సమక్షంలో నిర్విరామంగా కాంక్రీట్ పనులు జరిగాయి. డ్రోన్ కెమెరాల ద్వారా రాత్రి సమయంలోనూ పనుల వీడియో చిత్రీకరించారు. గిన్నిస్‌బుక్ ప్రతినిధులు స్పిల్ వే ఛానెల్ కాంక్రీట్ పనుల వేగం, నాణ్యతను పరిశీలించారు. ఇప్పటికే అధికారులను ప్రశంశించిన సీఎం చంద్రబాబు పోలవరంకు చేరుకొని పైలాన్ కూడా ఆవిష్కరించారు. గిన్నిస్ అధికారుల నుండి రికార్డ్ ను కూడా అందుకున్నారు.