అధికారం మాదే కదా అని, ఇష్టం వచ్చినట్టు కేసులు తీసివేస్తే రాజ్యాంగ వ్యవస్థలు చూస్తూ కూర్చుంటాయా ? సరిగ్గా అదే జరిగింది ఈ రోజు హైకోర్టులో. కృష్ణా జిల్లా జగ్గయపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు హైకోర్టులో ఈ రోజు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన పైన ఉన్న పది కేసులు ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోల పై హైకోర్ట్ లో సవాల్ చేసారు. ఏపీజేఎఫ్ అధ్యక్షుడు కృష్ణాంజనేయులు వేసిన ఈ పిటీషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. ఈ కేసులో పిటీషనర్ తరుపున న్యాయవాది జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. ఒక జీవోతో ప్రభుత్వం, పది కేసులు ఉపసంహరించుకోవటం ఏ విధంగా సాధ్యం అవుతుంది అంటూ, ఈ సందర్భంగా వాదనలు వినిపించారు. సీరియస్ నేచర్ ఉన్న ఈ కేసుల్లో ఉపసంహరణ అనేది సాధ్యం కాదని చెప్పి, వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలోనే హైకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకుని, ఈ కేసులు ఉపసంహరణకు సంబంధించి, ప్రధానంగా పబ్లిక్ ప్రాసిక్యుటర్ నిర్ణయం తీసుకోవాలని, కానీ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వటం ఏమిటి అంటూ, హైకోర్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో పాటుగా, ఇంత సీరియస్ నేచర్ ఉన్న కేసులని ఉపసంహరించుకోవటానికి గల కారణాలు, ప్రభుత్వం అనుసరించిన విధివిధానాలు తమ ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.

hc udyabhanu 12112021 2

దీనికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రధానంగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి, అదే విధంగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, రాష్ట్ర డీజీపీకి, హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకేసారి ఒకే వ్యక్తి పైన, పది కేసులు ఉపసంహరించుకోవటం ఏమిటి అంటూ కోర్టులో వాదనలు జరిగాయి. ఏ విధమైన రూల్స్ పాటించి, ఈ కేసులు తీసి వేసారో చెప్పాలి అంటూ హైకోర్ట్ ముందు వాదనలు వినిపించారు. ఇది చట్ట విరుద్ధం అని వాదించారు. హైకోర్టు కూడా ఈ వాదనతో ఏకీభవించి నోటీసులు జారీ చేసింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, ఇలా అనేక మంది ప్రజాప్రతినిధుల పై కేసులు ఎత్తి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాక్ష్యాత్తు జగన్ మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు కూడా, ఆధారాలు లేవని, సమాచారం లేదని ఇలా రకరకాల కారణాలతో కేసులు ఉపసంహరించుకున్నారు. దీని పైన కూడా ఇప్పటికే కోర్టులో కేసులు ఉన్నాయి. అధికారం ఉంది కదా అని, ఏది పడితే అది చేస్తే, కోర్టులు చూస్తూ ఊరుకోవు అని మరోసారి రుజువు అయ్యింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read