గత కొంత కాలంగా అటు ఉద్యోగ సంఘలాకు, ఇటు ప్రభుత్వానికి మధ్య పీఆర్సి విషయంలో కోల్డ్ వార్ జరుగుతుంది. పీఆర్సి నివేదిక ఇప్పటికే 34 నెలల పాటు ఆలస్యం అయ్యింది. ఇప్పటి వరకు పీఆర్సి నివేదిక ఉద్యోగ సంఘాల చేతికి రాలేదు. అయితే పీఆర్సి నివేదిక ఒక వారం రోజుల్లో ఇస్తామని గత నెల 29వ తేదీన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో హామీ ఇచ్చారు. అయితే వారం దాటినా ఇవ్వకపోవటంతో, ఉద్యోగ సంఘాలు వచ్చి సచివాలయంలో ఆరు గంటల పాటు నిరసన తెలిపిన పరిస్థితి ఉంది. అటు చీఫ్ సెక్రటరీ నుంచి కానీ, సియం ఆఫీస్ నుంచి కానీ ఎలాంటి సమాచారం లేకపోవటంతో, చివరకు వాళ్ళు వెనుతిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి. అయితే ఈ రోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఈ రోజు ఆర్ధిక అంశాల పై పెట్టారు కాబట్టి, ఇందులో ఉద్యోగులకు సంబంధించిన ఆర్ధిక అంశాలు అయిన పీఆర్సి చాలా ముఖ్యం అని, అటు ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాలు గట్టిగా ఈ విషయం పై అడిగాయి. మొత్తం 13 ఉద్యోగ సంఘాలలో, పది సంఘాలు ఈ రెండు సంఘల్లోనే ఉన్నాయి. దీంతో పీఆర్సి గురించి సమావేశంలో ఈ సంఘాలు పట్టుబట్టాయి. అయితే పీఆర్సి విషయం, ఈ సమావేశంలో సరైన చర్చ జరగకపోవటంతో, ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాయి.

employees 12112021 2

ప్రభుత్వ తీరుకి నిరసనగా, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి మధ్యలోనే బయటకు వచ్చాయి ఉద్యోగ సంఘాలు. ఏపీజేఏసీ నేత బొప్పరాజు మాట్లాడుతూ, అక్టోబర్ 29 నాటి భేటీలో ఇస్తామన్న నివేదిక ఇంకా ఇవ్వలేదని అన్నారు. కనీసం ఇవాళ్టి సమావేశంలో అయినా ఇస్తారని ఆశించాం అని, అయితే అధికారులు మాత్రం పీఆర్సీ నివేదిక ఊసే ఎత్తడం లేదని అన్నారు. అధికారుల కమిటీ మళ్లీ అధ్యయనం చేయడం ఏమిటీ? మేం అడిగిన అంశాలకు స్పష్టంగా సమాధానం ఇవ్వలేదని, ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకుంటే కార్యాచరణ ప్రకటిస్తాం అని బొప్పరాజు డిమాండ్ చేసారు. ఇక ఏపీఎన్జీఓ నేత బండి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వం పీఆర్సీ నివేదిక ఎందుకు బహిర్గతం చేయడం లేదో అర్ధం కావటం లేదని అన్నారు. రిపోర్ట్ ఇచ్చి మూడేళ్లయ్యిందని, మాముందు పెట్టటానికి ఎందుకు ఇబ్బంది అంటూ ప్రభుత్వాన్ని నిలదీసారు. ఇక జిల్లా స్థాయి ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి, తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం అని ఏపీఎన్జీఓ నేత బండి శ్రీనివాస్ తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read