వ్యక్తిగత సమాచార గోప్యత, ప్రైవసీ, ఆధార్ భద్రతపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్న వేళ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. భారత టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్‌) ఛైర్మన్‌ ఆర్‌ఎస్‌.శర్మ ఆధార్‌ నంబర్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఆయనకు సంబంధించిన సమాచారం మొత్తం హ్యాకర్లు బయటపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా.. ఆధార్‌ మరోసారి వార్తలోకెక్కింది. ఆధార్‌ గురించి సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబరు చాలా మంది ఫోన్లలో తమకు తెలియకుండానే సేవ్‌ అయిందని పలువురు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం భారత్‌లోని స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల ఫోన్‌ బుక్‌లో భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) హెల్ప్‌లైన్‌ నంబరు డీఫాల్ట్‌గా సేవ్‌ అయినట్లు కొందరు నెటిజన్లు ట్విటర్‌లో గగ్గొలు పెడుతున్నారు.

aadhar 0382018 2

దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను కూడా ట్విటర్‌ వేదికగా పోస్టు చేస్తున్నారు. ప్రస్తుతం ఆధార్‌ హెల్ప్‌లైన్‌ నంబరు 1947. దీని స్థానంలో కొత్తగా 1800-300-1947 నంబరు ఉడాయ్‌ పేరు మీద చాలా మంది ఫోన్లలో తమకు తెలియకుండానే డీఫాల్ట్‌గా సేవ్‌ అయినట్లు చెబుతున్నారు. దీనిపై నెటిజన్లు ట్విటర్‌ వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫోన్లలో తమకు తెలియకుండానే నంబర్‌ సేవ్‌ అయిందని, ఫోన్‌ హ్యాక్‌ చేసి ఈ విధంగా ఎవరైనా చేస్తున్నారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ‘నా ఫోన్‌ నంబరును ఆధార్‌తో అనుసంధానం చేసుకోకపోయినా ఇలా జరిగింది’ అని మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై ఉడాయ్‌ ఇప్పటి వరకు స్పందించలేదు.

aadhar 0382018 3

అయితే ఇది ప్రభుత్వమే చేస్తుందా, లేకపోతే ఫోన్ లు హ్యక్ అవుతున్నాయో తెలియక ప్రజలు తికమక పడుతున్నారు. ఇంత జరుగుతున్నా, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. కొంత మంది షేర్ చేసిన ట్వీట్లు ఇలా ఉన్నాయి. "Just spoke to the UIDAI chairman's office. They say they are not responsible for the 1800-300-1947 nmber mysteriously appearing on phones. This is therefore a mass hack attack." "Check your phone contacts: You may see an entry for UIDAI with the number 1800-300-1947. This has been pushed mysteriously thru the back end? If correct It means agencies can push anything into your phone without your knowledge. And extract anything."

Advertisements

Advertisements

Latest Articles

Most Read