తన సొంత అజెండా అమలుకాలేదన్న దుగ్ధతో, ప్రజాస్వామ్య విలువలకు తిలోద కాలివ్వడమేకాకుండా, తన చర్యలను సమర్థించుకునేక్రమంలో నైతికవిలువలని, ప్రజాస్వామ్యమని జగన్మోహన్‌రెడ్డి పెద్దపెద్దమాటలు మాట్లాడటం విచిత్రంగా ఉందని టీడీపీసీనియర్‌నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవా రం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీ సాక్షిగా జగన్‌చేసిన అసత్యప్రసంగాన్ని తప్పుపట్టారు. ప్రజలమాటను పెద్దల సభ పట్టించుకోలేదంటున్న జగన్మోహన్‌రెడ్డి, రాజధానిని తరలిస్తానని మేనిఫెస్టోలో చెప్పడంగానీ, నవరత్నాల్లో హామీఇవ్వడంగానీ చేయలేదన్నారు. అలాంటప్పుడు ఆ అంశం ఆయన వ్యక్తిగతం అవుతుందిగానీ, ప్రజాభిప్రాయం ఎలా అవుతుందన్నారు. విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, సజ్జలరామకృష్ణారెడ్డిల నాయకత్వంలో మండలిలో మంత్రులు ప్రవర్తించిన తీరు జగన్‌కు కనిపించలేదా అని దేవినేని ప్రశ్నించారు. మైనారిటీ నేత, ఛైర్మన్‌ను ఉద్దేశించి దుర్భాషలాడటం, ఆయన తల్లిదండ్రులను, మతాన్ని దూషించడం జగన్‌ చెవికి ఎక్కకకపోవడం విచారకరమన్నారు. బుగ్గనరాజేంద్రనాథ్‌రెడ్డి స్వయంగా ఛైర్మన్‌పోడియం వద్దకెళ్లి అనరానిమాటలంటే, దానిగురించి జగన్‌ నోటి నుంచి ఒక్కమాటకూడా రాలేదన్నారు.

మండలి ప్రసారాలను ఎందుకు ఆపేశారో.. ఫోన్లు పనిచేయకుండా జామర్లు ఎందుకువాడారో చెప్పాలన్నారు. తన పంతం నెగ్గలేద న్న అక్కసుతో, రూ.30కోట్లు ఖర్చు పెట్టినా ఉపయోగంలేకుండాపోయిందని విజయసా యిని, బొత్సను జగన్‌ తిట్టినట్టు వార్తలు కూడా వచ్చాయన్నారు. సంతలో పశువులని కొన్నట్లు, తన అవినీతి సంపదను ఎమ్మెల్సీ కొనుగోలుకు వెదజల్లాడన్నారు. గతంలో ఎవరైనా తనపార్టీలోకి రావాలంటే రాజీనామాలు చేసిరావాలంటూ శ్రీరంగనీతులు చెప్పిన జగన్‌, ఇప్పుడెలాంటి పనులు చేస్తున్నాడని దేవినేని నిలదీశారు. దేవుడిస్క్రిప్ట్‌ ప్రకారమే టీడీపీకి 23స్థానాలు వచ్చాయన్న ముఖ్యమంత్రి, ఆ 23మందిని ఎదుర్కోలేక దేవుడిస్క్రిప్ట్‌కి వ్యతిరేకంగా పాలన చేస్తున్నాడన్నారు. శాసనమండలి రద్దు తనచేతుల్లో లేదని తెలిసీ కూడా ఆదిశగా అడుగులువేస్తున్నాడన్నా రు.శుక్రవారం కోర్టుకు హాజరవ్వడం కోసమే అసెంబ్లీకి సెలవు ప్రకటించాడన్నారు. మైనారిటీ నాయకుడు శాసనమండలి స్పీకర్‌గా కూర్చోవడాన్ని జగన్‌ జీర్ణించుకోలేకపో తున్నాడని, అందుకోసమే దానిరద్దుకి యత్నిస్తున్నాడన్నారు. 40ఏళ్ల అనుభవాన్ని ఎగతాళిచేస్తున్న మంత్రులందరికీ, రూల్‌-71తో దిమ్మదిరిగేలా చేయడం చంద్రబాబుకే సాధ్యమైందన్నారు. కొడాలినాని బూతులుమాట్లాడినప్పుడు ఖండించిఉంటే, ద్వారంపూడి నోరెత్తేవాడు కాదని, ఆయన్ని చూసి తణుకుఎమ్మెల్యే హద్దులుమీరాడన్నారు. మంత్రులు , ఎమ్మెల్యేలతో దాడి చేయించడం, బూతులు తిట్టించడం ద్వారా, జగన్‌లోని పైశాచిక ఆనందం తృప్తి పడుతోందని ఉమా దుయ్యబట్టారు.

మండలిస్పీకర్‌ వ్యాఖ్యలను అసెంబ్లీ లో చూపించడంతోనే జగన్‌ తెలివిఏపాటిదో అర్థమైందన్నారు. 25మంది రైతులు, రైతుకూలీలు చనిపోయినప్పుడు స్పందించని జగన్‌మనసు, మండలిలో బిల్లు ఆమోదం పొందకపోవడంతో చలించిందని దేవినేని ఎద్దేవాచేశారు. విజయసాయి, వై.వీ.సుబ్బా రెడ్డి, సజ్జలసాయంతో సోమవారంనాటికి ఎంతమందిని వీలైతే, అంతమంది టీడీపీ ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టే పనిలో జగన్‌ ఉన్నాడన్నారు. శాసనమండలి నిర్వహణకు రూ.60కోట్లు ఖర్చవుతాయంటున్న ముఖ్యమంత్రి, తనపార్టీ కార్యకర్తలకు వాలంటీర్ల ముసుగులో నెలకు రూ.200కోట్లు ఎందుకు ఖర్చుచేస్తున్నాడో సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్‌చేశారు. వైసీపీకార్యకర్తలకే ఏటా రూ.2,400కోట్ల ప్రజాధనాన్ని జగన్‌ అప్పనంగా దోచిపెడుతున్నాడని, దాతలు నిర్మించిన భవనాలకు పార్టీ రంగులేయడానికి రూ.1200కోట్లు ఖర్చుచేశారన్నారు. ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లడానికి ప్రతివారం రూ.60లక్షలు ఖర్చవుతుందని, ఏడాదికి రూ.30కోట్లు అక్రమాస్తులకేసుల్లో కోర్టుకు వెళ్లడానికే అవుతున్న విషయం జగన్‌కు తెలియదా అని ఉమా నిలదీశారు. సజ్జల సహా, అనేకమంది సాక్షివేగుల్ని ప్రభుత్వకార్యాలయాల్లో నియమించి ఏటా రూ.1000 కోట్లు దోచిపెడుతున్నారన్నారు. తన ఇంటి కిటికీలు మార్చడానికి రూ.80లక్షలు, రోడ్లు వేయడానికి, రంగులకు రూ.40కోట్ల ప్రజాధనాన్ని వాడుకున్నారన్నారు. జగన్మోహ న్‌రెడ్డి తలకిందులుగా తపస్సుచేసినా మండలిని రద్దుచేయలేడని ఉమా తేల్చిచెప్పారు. సెలెక్ట్‌ కమిటీ ప్రజాభిప్రాయం సేకరించాక, నివేదికను అసెంబ్లీకి అందచేస్తుందన్నారు. ఒకవేళ సీబీఐ, ఈడీకేసుల్లో శిక్షపడి జైలుకువెళితే, తనను బయటకు తీసుకురావడానికే ముందస్తుగా ప్రజలసొమ్ముతో జగన్‌, ఢిల్లీ న్యాయవాది ముకుల్‌రోహత్గీని నియమించు కున్నాడన్నారు. విజయసాయి బెయిల్‌ను రద్దుచేయమని కోర్టుని ఆశ్రయిస్తామని దేవినేని స్పష్టంచేశారు. జగన్‌ మండలిరద్దు వంటి తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుంటే కోర్టులను ఆశ్రయించైనా సరే, ఆయన్ని అడ్డుకుంటామన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read