ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సాగు, తాగునీరందించేందుకు స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని, అనంతరం చంద్రబాబు ప్రాజెక్ట్ పూర్తికి కృషి చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో 15 లక్షల మందికి తాగునీరు, ప్రకాశం జిల్లాలో 23 మండలాల్లో 3.36 లక్షల ఎకరాలు, కడప జిల్లాలో 27 వేల 200 ఎకరాలు, నెల్లూరులో 84 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పనులు పరిగెత్తిస్తే, వందల కోట్ల అవినీతి జరిగిందంటూ.. వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. టన్నెల్-1 పనులను అదే ఏజెన్సీ నిర్వహిస్తోందని, ఆరో పణలు చేసిన నాయకులు ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ విసిరారు. మొదటి టన్నెల్ పనులు చేసేవారికే రెండో టన్నెల్ పనులు ఎందుకు అప్పగించారో చెప్పాలని నిలదీశారు. టన్నెల్ బోరింగ్ యంత్రాలతో చేయాల్సిన పనులను టెండర్లు పిలవకుండా నామినేషన్ల కింద లంకారెడ్డితో టన్నెల పనులు చేయిస్తున్నారని ఆరోపించారు.
చెన్నైలో డిస్టిలరీల వద్ద రోజు కురూ. పది కోట్లు అనిల్ రెడ్డి అనే వ్యక్తి వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. ఇది జేటాక్స్ కదా అని ప్రశ్నించారు. మైనింగ్ కుంభకోణాలన్నీ ద్వివేది ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయ న్నారు. వీటన్నింటిపైనా జగన్ సమాధానం చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. జగన్ సొంత కంపెనీ సరస్వతి పవర్ కు, మైనింగ్ లీజు 50 ఏళ్లకు దోచిపెట్టారని దేవినేని ఉమా అన్నారు. కృష్ణా నదిలో నీళ్ళు దోచిపెట్టే అధికారం, వీరికి ఎవరు ఇచ్చారు అంటూ, ఉమా ధవజమేత్తారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయంలో, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నారని, ఇప్పుడు తానే ముఖ్యమంత్రి కావటంతో, ఇష్టం వచ్చినట్టు దోచేస్తున్నారని అన్నారు. లోకేష్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా, చాలెంజ్ అంటూ పార్థసారధి అంటున్నాడని, గడ్డి వాములో దొరికిన మద్యం పై పార్థసారధి చాలెంజ్ చెయ్యాలని దేవినేని ఉమా అన్నారు.