మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ఆర్ తో ఎంతో సన్నిహితంగా ఉండే వారు. ఆ తరువాత, జగన్ మోహన్ రెడ్డిని ప్రతి విషయంలో వెనకేసుకుని వచ్చే వారు. జగన్ మోహన్ రెడ్డిని సియం కుర్చీ ఎక్కించటంలో ఆయన కూడా, ఆయనకు తోచిన సహయం చేసారనే చెప్పాలి. ప్రతి విషయంలో చంద్రబాబుని విమర్శిస్తూ, జగన్ ని వెనకేసుని వచ్చేవారు. ఇప్పుడు కూడా, జగన్ సియం అయిన తరువాత, అనేక విషయాల్లో అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నా, ఉండవల్లి మాత్రం స్పందించలేదు అనే విమర్శలు వచ్చాయి. చివరకు రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన రాజధాని విషయంలో కూడా, మూడు ముక్కలు చెయ్యటం పై స్పందించలేదు. అయితే, ఉండవల్లి ఎట్టకేలకు ఈ విషయం పై స్పందించారు. ప్రతి విషయంలో జగన్ ను వెనకేసుకుని వచ్చే ఉండవల్లి, ఈ విషయంలో మాత్రం భిన్నంగా స్పందించింది, వైసీపీకి షాక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై ఎంతో కన్ఫ్యూజన్ ఏర్పడిందని, ఉండవల్లి అన్నారు.
ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం, ప్రభుత్వం మారి తర్వాత అధికారంలోకి వచ్చిన ఇంకో ప్రభుత్వం రద్దు చేస్తే, ఇక ఆ రాష్ట్రం మీద ఎవరికైనా నమ్మకం ఉంటుందా అని ప్రశ్నించారు. ఇక ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏ పని చెయ్యటానికి అయినా ఎందుకు వస్తారు అని ఉండవల్లి ప్రశ్నించారు. మూడు రాజధానుల విషయం పై, ఏమి చెప్పలేక పోతున్నాని అన్నారు. అసెంబ్లీ ఒక చోట, సచివాలయం మరోచోట అనే కాన్సెప్ట్ మన దేశంలో ఎక్కడా లేవని, ఎప్పుడూ చూడలేదని ఉండవల్లి అన్నారు. జగన్ మోహన్ రెడ్డి, రాజధాని మీద ఫోకస్ పెట్టి, ముందుకు వెళ్తాం కంటే, పోలవరం, ప్రత్యేక హోదాకు ప్రాధాన్యం ఇవ్వాలని, వాటి వల్ల రాష్ట్రానికి మేలని ఉండవల్లి వ్యాఖ్యానించారు. జగన్ ఆ విధంగా ముందుకు వెళ్లాలని అన్నారు.
రాజధాని అనేది రాష్ట్ర పరిధిలో ఉండే విషయం అని కేంద్రం చెప్పింది అని, మళ్ళీ అదే కేంద్రం 2015లోనే అప్పటి ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిందని కూడా కేంద్రమే చెప్పిందని, ఇలాంటి గందరగోళ పరిణామం గతంలో ఎప్పుడూ చూడలేదని ఉండవల్లి అన్నారు. జగన్ మోహన్ రెడ్డి కూడా విశాఖపట్నం ను హైదరాబద్ లా చేస్తాను అంటున్నారని, మళ్ళీ అవే తప్పులు ఎందుకని, మనకు మరో హైదరాబాద్ వద్దు అని, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని ఉండవల్లి అన్నారు. ఇక పోలవరం పై మాట్లాడుతూ, పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయని ఉండవల్లి అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ పై మాట్లాడుతూ, ఆయన సినిమాల్లో నటించడంలో తప్పు లేదని, గతంలో తాను కూడా ఆయన్ను సినిమాలు చేసుకోమని సలహా ఇచ్చానని అన్నారు.