గతంలో చంద్రబాబు ఇబ్బంది పెట్టటానికి ఉండవల్లి అరుణ కుమార్, ఐవైఆర్ లాంటి వాళ్ళు వేసిన పిటీషన్లు, ఈ రోజు జగన మోహన్ రెడ్డినే ఇబ్బంది పెట్టె పరిస్థితి వచ్చింది. దీన్నే విధి రాత అంటారేమో. మొన్నటి దాకా బొత్సా లాంటి నాయకుల చేత, అమరావతి పై కన్ఫ్యుజింగ్ స్టేట్మెంట్ లు ఇప్పిస్తూ ప్రజలను డైవర్ట్ చేస్తూ, రాజకీయం చేసిన వైసీపీ ప్రభుత్వానికి, ప్రస్తుతం ఆన్ రికార్డు, అదీ కోర్ట్ లో, చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు జగన్ గారు, హైకోర్ట్ సాక్షిగా అమరావతి పై ఎలాంటి ప్రకటన చేస్తారు, కోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున, అమరావతి పై వైఖరి ఏమి చెప్తారు అనేది చూడాలి. వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబులింగ్ చట్ట నిబంధనలను అనుసరించి, స్విస్ ఛాలెంజ్ విధానం ద్వారా అమరావతిలో ప్రాజెక్ట్ పనులు చేపట్టే విషయం పై మీ వైఖరి చెప్పండి అంటూ హైకోర్ట్, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అమరావతి స్విస్ ఛాలెంజ్ విధానం పై వైఖరి చెప్పటానికి, ప్రభుత్వానికి ఈ నెల 16 వరకు టైం ఇస్తూ, విచారణ వాయిదా వేసింది. స్విస్ ఛాలెంజ్ విధానం పై క్లారిటీ ఇస్తే, అమరావతి పై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం నిన్న, విచారణ సందర్భంలో ఈ ఆదేశాలు ఇచ్చింది. స్విస్ ఛాలెంజ్ విధానం పై, ఏపీఐడీఈ చట్టం-2001కి సవరణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ కార్యదర్శి తెచ్చిన సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ ‘ఫౌండేషన్ ఫర్ సోషల్ అవేర్‌నెస్ సొసైటీ’ సభ్యులు వై.సూర్యనారాయణ మూర్తి ఏడాది క్రితం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇదే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్విస్ ఛాలెంజ్ విధానాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు కూడా 2018లో హైకోర్టును ఆశ్రయించారు.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కూడా అమరావతిలో, చట్ట నిబంధనలకు విరుద్ధంగా రాజధాని నిర్మాణ పనుల ఒప్పందాలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని కోరుతూ హైకోర్ట్ లో ఈ ఏడాది ఏప్రిల్ లో కేసు వేసారు. ఈ వ్యవహారం పై సీబీఐతో విచారణ జరిపించాలని కోర్ట్ ని కోరారు. ఈ అన్ని పిటీషన్ల పై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. అయితే పిటిషనర్ల తరపు న్యాయవాది సి.రఘు వాదనలు వినిపిస్తూ, ప్రస్తుతం రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగందని, కొత్త ప్రభువానికి అమరావతి పై పునఃసమీక్ష చేసే ఆలోచన ఉందని, కొన్ని పనులు రద్దు చేశారని పత్రికల్లో వార్తలు వచ్చాయని, అందుకే గత ప్రభుత్వంలో ఉన్న స్విస్‌ఛాలెంజ్ విధానం పై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలుసుకోవాలన్నారు. దీంతో హైకోర్ట్, ఏపి ప్రభుత్వాన్ని ఈ విషయం పై క్లారిటీ ఇవ్వమంటూ, కేసును 16వ తేదికి వాయిదా వేసింది.