కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే తెలియని వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. ప్రతిది లిటిగెంట్ గా మాట్లాడుతూ, ప్రభుత్వాలని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ప్రభుత్వాలు అంటే అన్ని ప్రభుత్వాలు కాదు, కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. టార్గెట్ చంద్రబాబు మాత్రమే. చంద్రబాబు సియంగా ఉన్నంత సేపు, ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. వైసిపీ నేతలకు పాయింట్ మాట్లడటం రాదనో ఏమో కాని, ప్రతి సారి ఉండవల్లి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, చంద్రబాబు పై విమర్శలు చేసే వారు. పట్టిసీమ దండగ అని చెప్పటం దగ్గర నుంచి, పోలవరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని, నాణ్యత లేదని, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వారానికి మూడు సార్లు అయినా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని ఏకి ఏకి పెట్టేవారు. అయితే జగన్ మోహన్ రెడ్డి గెలిచిన దగ్గర నుంచి ఉండవల్లి అడ్డ్రెస్ లేరు. మన నీళ్ళు కేసిఆర్ తీసుకుపోతుంటే, తెలంగాణా భూభాగంలో మనం ప్రాజెక్ట్ కడుతుంటే, దానికి జగన్ సై అంటుంటే, ఉండవల్లి మాత్రం అడ్రస్ లేరు.
అయితే ఉండవల్లి మిస్సింగ్ పై, కొంత మంది ఎన్ఆర్ఐలు, ఉండవల్లిని ఉద్దేశించి బహిరంగ లేఖ రాసారు. ఒక పక్క కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుంది, మరో పక్క కేసిఆర్ గోదావారి జలాలు తీసుకుపోతున్నాడు, జగన్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. మరి ఈ విషయం పై మీరు ఎందుకు మాట్లాడటం లేదు అంటూ ఉండవల్లిని ప్రశ్నిస్తూ లేఖ రసారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం, మొన్నటిదాకా మాట్లాడిన మీరు అంటే, మాకు ఎంతో గోవరం, విభజన సమయంలో కూడా పోరాడారు, కోర్ట్ కు వెళ్లారు, మా కోసం ఎంతో పోరాడిన మీరు, ఇప్పుడు ఇంత ఘోరం జరుగుతుంటే, భావి తరాలకు అన్యాయం చేసేలా గోదావరి జలాల పై రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంటే, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మీలాంటి మేధావులు ప్రభుత్వాలు చేస్తున్న ఇలాంటి తప్పిదాల పై స్పందించాలి, బహిరంగంగా చర్చించాలి అని ఆ లేఖలో కోరారు. అయితే జగన్ కోసం ఎంతో కష్టపడిన ఉండవల్లి, ఈ లేఖ పై స్పందిస్తారా, లేక లైట్ తీసుకుంటారో వేచి చూడాలి.