జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నెమ్మదిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసారు. అక్కడ పనులు అన్నీ ఆపేసి, వైసీపీ మంత్రులు అంటున్నట్టు నిజంగానే, దాన్ని స్మశానం చేసారు. ఇక తరువాత, నెమ్మదిగా అమరావతి అక్కడ ఉండదు అనే సంకేతాలు ఇచ్చి, అసెంబ్లీ సమావేశాల్లో, అమరావతిని మూడు ముక్కలు చేస్తున్నట్టు ప్రకటించారు. అమరావతిని మూడు ముక్కలు చేస్తున్నాం అని, విశాఖలో ఒక ముక్క, కర్నూల్ లో ఒక ముక్క, అమరావతిలో మరో ముక్క ఉంచుతాం అని చెప్పారు. అయితే ఈ మూడు ముక్కల రాజధాని అనేది మంచి నిర్ణయం కాదని అందరూ చెప్తున్నారు. ఇది పక్కన పెడితే, అక్కడ 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఉన్నారు. తమ జీవితాలు బాగు పడతాయి, తమతో పాటు రాష్ట్రానికి ఒక మంచి రాజధాని వస్తుంది, మనల్ని గెంటిన వారికి, హైదరాబాద్ కంటే ధీటైన రాజధాని నిర్మాణం చేసుకోవచ్చు అని అనుకున్నారు. కాని, జగన్ మోహన్ రెడ్డి దీన్ని మూడు ముక్కలు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చెయ్యటంతో, అమరావతి ప్రజలు ఉద్యోమం మొదలు పెట్టారు, చివరకు రాజధాని మార్పు, సీఆర్డీఏ చట్టం అనేది కోర్టులోకి వెళ్ళింది.

అయితే ఈ విషయం పై, మాజీ ఎంపీ, ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఒక యుట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఉండవల్లి అరుణ్ కుమార్ అమరావతి పై మాట్లాడారు. చంద్రబాబు చెప్పుకున్నంత కాకపోయినా, అమరావతిలో నిర్మాణాలు జరిగాయని, కొన్ని జరుగుతున్నాయని, ఇప్పుడు ఉన్న అసెంబ్లీ, సెక్రటేరియట్ అక్కడే కదా ఉంది అన్నారు. వైసీపీ ఆరోపిస్తున్నట్టు అక్కడ స్మశానం ఏమి లేదని, అన్నారు. అలాగే అమరావతి మార్పు అనేది, ఎవరి తరం కాదని, అక్కడ నుంచి రాజధాని మార్చటం అనేది జరగదు అని అన్నారు. గతంలో ఒప్పుకుని, అందరూ ఏకగ్రీవంగా రాజధాని అమరావతి ఉండాలని, ఇప్పుడు మార్చటం కుదరదు అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసి, అలాగే అక్కడ డబ్బులు ఇచ్చిన చోటు, ఇప్పుడు మార్చి వేరే చోటు పెడతాను అంటే, అది జరిగే పనే కాదని అన్నారు. ఇక్కడే కావలి అంటే, చంద్రబాబు చెప్పినట్టు కాకుండా, వీళ్ళ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు కాని, ఇక్కడ నుంచి అమరావతిని రాజధానిగా మార్చటం జగన్ వల్ల కాదని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read