మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. కరోనా విషయంలో జగన్ పై విమర్శలు చేసారు ఉండవల్లి. జగన్ గారు కరోనా ఉంది, ప్రజలకు చెప్తున్నారు మాస్కులు పెట్టుకోమని, కానీ జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం మాస్కులు వేసుకోవటం లేదు, అధికారులు కూడా మాస్క్ వేసుకోవటం లేదు, ప్రజలకు చెప్పే ముందు, మీరు మాస్కు వేసుకోండి అని ఉండవల్లి అన్నారు. ఆవ భూములు విషయంలో పెద్ద స్కాం జరిగిందని అన్నారు. రేటు లేకపోయినా, ఎక్కువ పెట్టి భూములు కొన్నారని, అధికారులు, మంత్రులు మాత్రం, స్కాం ఏమి లేదని అంటున్నారని, కాని ఇందులో చాలా పెద్ద గోల్ మాల్ జరిగిందని, దీని పై రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆక్ట్ ప్రకారం సమాచారం అడిగినట్టు చెప్పారు. అవినీతి అయినా అయ్యి ఉండాలి, లేకపొతే అసమర్ధత అయినా అయ్యి ఉండాలని ఉండవల్లి అన్నారు. ఇళ్ళ స్థలాల పేరుతో చేస్తుంది అంతా తప్పు అని, ఎక్కడో ఊరి బయట 20 కిమీ అవతల ఇళ్ళ స్థాలాలు ఇస్తే, మీరు చెప్పుకోవటానికి తప్ప, దాని వల్ల ఎవరికీ ఉపయోగం ఉందని ఉండవల్లి అన్నారు. టైం తీసుకుని అయినా ఉపయోగ పడే భూములు ఇవ్వాలని అన్నారు. ఇక ఈ భూములు మెరక తోలే విషయంలో కూడా పెద్ద స్కాం జరుగుతుందని, దీని పై ఏసీబీకి కంప్లైంట్ చేస్తానని ఉండవల్లి అన్నారు.
ఇక ఇసుక విధానం దారుణంగా ఉందని ఉండవల్లి అన్నారు. ఆన్లైన్ లో ఇసుక అనేది ఎక్కడ జరగటం లేడని, ఎక్కడ చూసినా అవినీతే అని అన్నారు. దీని వల్ల లేబర్ కు కూడా పనులు లేకుండా, చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాజమండ్రిలోనే ఇసుక ఇబ్బందులు ఉంటే, దీని వెనుక ఏమి జరుగుతుంది ? అని అన్నారు. ఇక మద్యం విషయంలో భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయని అన్నారు. పక్క రాష్ట్రాల్లో ఎలాంటి ధరలు ఉన్నాయి, ఇక్కడ జరుగుతున్న వాటికి చూస్తే, కేసుకి ఇంత అని పెర్సెంటేజ్ తీసుకుంటున్నారని ఉండవల్లి అన్నారు. కొనటం, అమ్మటం ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి, మొత్తం ప్రభుత్వానిదే బాధ్యత అని ఉండవల్లి అన్నారు. ప్రభుత్వం మాత్రం, కొనటం తగ్గించారని చెప్తున్నారని, కాని పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ అక్రమ మాఫియా రాజ్యం ఏలుతుందని అన్నారు. అలాగే నాటు సారా ఎక్కడ పడితే అక్కడ వచ్చేసింది అని అన్నారు.