వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహనరెడ్డి మాట తప్పడు.. అంటూ ప్రజలు ఎంతో నమ్మకంతో గత ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించారని, ఆ నమ్మకాన్ని జగన్ వమ్ము చెయ్యకుండా పోలవరం ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యత నివ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును వెంటనే పూర్తి చెయ్యాలని లేకుండా జాతి సైతం క్షమించదని ఉండవల్లి ధ్వజమెత్తారు. స్థానిక వై జంక్షన్లోని ఆనంరోటరీ హాలులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుపై శ్వేత పత్రంతో తాను డిమాండ్ చేశానన్నారు. అయితే వెబ్ సైట్లో వివరాలు చూసుకోవాలని ఆనాటి ప్రభుత్వ ప్రతినిధులు తనకు సూచించారన్నారు. అయితే 2019 జనవరి నుంచి ఇప్పటి వరకూ ఆ వెబ్ సైట్లో ఎలాంటి అప్ డేట్స్ లేవన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో కూడా అనుకున్నంత రీతిగా పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిమిత్తం రూ.1800 కోట్లు విడుదల చేసిందన్నారు.

దానిని ఆరోగ్యశ్రీ ఇతర ఖర్చుల నిమిత్తం వినియోగించినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అయతే ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు పెట్టిన దాని నిమిత్తం కేంద్రం చెల్లించిన నిధులను మాత్రమే ఈ సర్కార్ ఇతర ఖర్చులకు నియోగించిందని తెలిపారన్నారు. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.700 కోట్లు ఆదా చేశామని ప్రభుత్వం చెబుతుంటే.. సకాలంలో ప్రాజెక్టు పూర్తిచేసి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను సకాలంలో ప్రారంభించకపోతే చాలా నష్టాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని ప్రతిపక్షాలు చెబుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టులో ముఖ్యమైన హామీ ఇవ్వడం లేదని, ఇటీవల ఈ అంశంపై తెదేపాకు చెందిన ఎంపి రామ్మోహన నాయుడు, వైకాపు చెందిన రాజమహేంద్రి ఎంపి మార్గాని భరత్ రామ్ మాట్లాడారన్నారు. ప్రాజెక్టు పూర్తిచేసిన ఆర్ఎంఆర్ ప్యాకేజీ ఇవ్వకపోతే ఫలితం ఉండదన్నారు. ఇటీవల ప్రాజెక్టును పరిశీలించిన సెంట్రల్ వాటర్ కమీషన్ ప్రతినిధులు ఒక నివేదిక సమర్పించారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 222 గ్రామాల్లో లక్షా 5వేల 601 కుటుంబాలు నిరాశ్రయులవుతు న్నారన్నారు. వారిలో 3,922 కుటుంబాలను మాత్రమే సురక్షిత ప్రాంతాలకు తరలించారని తెలిపారు. ఇంకా లక్షా ఒక వెయ్యి 679 కుటుంబాలకు వునరావాసం కల్పించాల్సి ఉందన్నారు.

అందుకు రూ.35వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్రంపై తీవ్ర సాయిలో ఒత్తిడి తేవాలని, కేసుల కోసం భయపడకుండా పోరాడితే జనబలం కల్లిన సీఎం జగన్‌ను కేంద్రం ఏమీ చెయ్యలేదన్నారు. రాజమహేంద్రవరంలో పోలీస్ స్టేషన్ ప్రారంభించిన క్రమంలో మీడియాను వరిమితం చెయ్యడం సరికాదన్నారు. ఇంత గొప్ప విషయాన్ని అన్ని మీడియా సంస్థలను పిలిచి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పెన్షన్ లు ఎత్తేయటం అనేది, జగన్ పతనానికి నాంది అని అన్నారు. తక్షణమే నిలిపివేసిన మీడియా చానల్స్ ప్రసారాలను పునరుద్ధరించాలని కోరారు. ఇది ఇలా ఉంటే, మొన్నటి దాకా, ఉండవల్లి, జగన్ మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసారు. ఇప్పుడు ఇలా అన్ని విషయాల్లో విమర్శలు చెయ్యటం పై, వైసీపీ క్యాడర్ కూడా ఆలోచనలో పడింది. తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తుంది అంటే, అది రాజకీయ విమర్శలు అనుకోవచ్చు, అలాంటిది, సొంత మనిషి అనుకున్నవాడే ఇలా ఎక్కి తొక్కుతుంటే, వైసీపీ క్యాడర్ కు ఏమి అర్ధం కావటం లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read