ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అంతర్జాతీయంగా అరుదైన ఆహ్వానం అందింది. ‘‘ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్: గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్’’ అనే అంశంపై ఐక్యరాజ్య సమితిలో ప్రంసంగించాల్సిందిగా సీఎంను యూఎన్ఓ ఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు వచ్చే నెల 24న యూఎన్ఓ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. న్యూయార్క్‌లో జరగనున్న ఈ సదస్సులో సీఎం కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. కాగా, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అనుసురిస్తున్న విధానాలను యూఎన్ఓ ప్రశంసించింది.

cbn 29 08 2018 2

2024లోపు 60 లక్షల మంది రైతులను సేంద్రీయ సాగు బాట పట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి యూఎన్ఓ సాయం చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా కృషి చేస్తున్నవారికి చంద్రబాబు తన గళం వినిపించాలని ఐక్యరాజ్యసమితి కోరింది. రసాయనాల జోలికి వెళ్లకుండా ప్రకృతి సిద్ధంగా సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలనుకున్నారు. సుభాష్‌ పాలేకర్‌ సూచనలతో జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. రైతు సాధికార సమితిల సాయంతో రైతులను సేంద్రీయ సాగు వైపు మళ్లించారు. తక్కువ కాలంలోనే ఏపీలోని రైతులు జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ వైపు మొగ్గు చూపారు.

cbn 29 08 2018 3

ఏపీ రైతులను ప్రకృతి సిద్ధమైన సాగు వైపు నడిపించిన చంద్రబాబు కృషిని సర్వత్రా కొనియాడుతున్నారు. ఇప్పటికే దీనిపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ప్రత్యేక కథనం ప్రచురించింది. దేశంలోనే ఏపీ మొట్టమొదటి జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ స్టేట్‌ అంటూ కితాబునిచ్చింది. ఐక్యరాజ్యసమితియే కాదు న్యూయార్క్‌ టైమ్స్‌లోనూ సీఎం చంద్రబాబు నూతన విధానంపై ప్రత్యేక కథనం వచ్చింది. వ్యవసాయానికి ప్రకృతికి చేరువ చేయాలంటూ వెలువడ్డ కథనంలో ఏపీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌పై న్యూయార్క్‌ టైమ్స్‌లో ప్రత్యేక కథనం రావడం ఆసక్తిరేపుతోంది. నేచురల్‌ ఫార్మింగ్‌ను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయి. పొరుగున ఉన్న కర్ణాటక ఏపీ బాటలోనే నడిచేందుకు సిద్ధమైంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read