ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిని, బీజేపీ నాయకులు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారో చూస్తున్నాం. మోడీ తరువాత, ప్రధాని అభ్యర్ధి లక్షణాలు అతనికే ఉన్నాయి అంటూ, ఉత్తర్ ప్రదేశ్ లో ఆదర్శవంతమైన పాలన నడుస్తుంది అంటూ హంగామా చేస్తూ ఉంటారు. అయితే అక్కడ పరిస్థితులు మాత్రం దారుణంగా ఉంటాయి. అలంటి ఒక సంఘటనే అక్కడ జరిగింది. యాపిల్‌ సంస్థ ఉద్యోగిని.. ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ కాల్చి చంపడం సంచలనం సృష్టించింది. కారు ఆపలేదన్న కారణానికే.. నిండు ప్రాణాలను బలితీసుకోవడం కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. లఖ్‌నవూలోని విలాసవంతమైన గోమతీనగర్‌ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ప్రశాంత్‌ చౌధరి అనే కానిస్టేబుల్‌ జరిపిన కాల్పుల్లో.. యాపిల్‌ సేల్స్‌ మేనేజర్‌ వివేక్‌ తివారీ (38) మరణించారు.

up 30092018 1

ఘటన జరిగిన సమయంలో తివారీతోపాటు కారులో ఆయన సహోద్యోగి సనాఖాన్‌ కూడా ఉన్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లు బైక్‌పై తమ కారు ముందుకు వచ్చి.. అడ్డగించే ప్రయత్నం చేసినట్లు ఆమె మీడియాకు తెలిపారు. తివారీ ముందుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో.. కారు వారి బైక్‌ను ఢీకొట్టిందని చెప్పారు. వెంటనే ఓ కానిస్టేబుల్‌ తమపై కాల్పులు జరిపాడని పేర్కొన్నారు. అనంతరం ఆ ఇద్దరు తనకు మళ్లీ కనిపించలేదని.. అటుగా వచ్చిన ట్రక్కు డ్రైవర్ల సాయంతో ఘటనపై తాను పోలీసులకు సమాచారం ఇచ్చానని ఆమె చెప్పారు. అనంతరం తివారీని పోలీసులు ఆసుపత్రికి తరలించారని వివరించారు. చికిత్స పొందుతూ తివారీ ప్రాణాలు వదిలారు.

up 30092018 1

తూటా గాయాల కారణంగానే ఆయన చనిపోయినట్లు శవపరీక్షలో తేలింది. దీంతో సనాఖాన్‌ ఇచ్చిన వాంగ్మూలం మేరకు.. పోలీసులు ప్రాథమిక దర్యాప్తు నివేదికను నమోదు చేశారు. తివారీ మృతికి బాధ్యులైన ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. వారిని సర్వీసు నుంచి తొలగించనున్నట్లు రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్‌ తెలిపారు. ఆత్మ రక్షణ పరిమితులను దాటి వారు అతిగా వ్యవహరించినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైందని అన్నారు. ఎవరినీ కాల్చేందుకు పోలీసులకు అనుమతి లేదని స్పష్టంచేశారు. తన భర్త మరణానికి రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సమాధానం చెప్పాలని తివారీ భార్య కల్పన డిమాండ్‌ చేశారు. ‘నా భర్త ఉగ్రవాదా?’ అని ప్రశ్నించారు. తివారీ, కల్పన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద ఎత్తున బూటకపు ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని.. వీటిపై ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read