తెలోగుడితో పెట్టుకుంటే ఏమవుతుందో ఇందిరా గాంధీకి తెలుసు, సోనియా గాంధీకి తెలుసు... చరిత్ర చూసి కూడా తెలుసుకోకుండా, తెలుగోడితో పెట్టుకుంటే మిగిలేది మట్టే అనే వాస్తవం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పెద్దలు గుర్తించాలి... ఇదేదో సెంటిమెంట్ తో చెప్పే సొల్లు కాదు, వాస్తవం... ఇప్పటికైనా మించి పోలేదు.. లేదు అంటారా... మీ ఖర్మ... ఈ రోజు జరిగింది శాంపిల్ మాత్రమే.. ముందు ఉంది అసలు సినిమా... మీకు కంచుకోట అనుకున్న చోటే, గుండు కొట్టించారు... ఇప్పటి వరకు ఉన్న జైత్ర యాత్రకు బ్రేక్ పడింది... దీనికి తెలుగోడికి సంబంధం లేకపోయినా, మామ్మల్ని ఇబ్బంది పెట్టిన పాపం ఊరికే పోదు... మీ పెద్దాయన అద్వానీకి జరిగిన అవమానాలు ఊరికే పోవు... ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్ ఉంది... ఇక విషయానికి వస్తే..
ఉప ఎన్నికలు జరిగిన 3 పార్లమెంట్ నియోజక వర్గాలలోనూ భా.జ.పా ఓటమి దిశగా అడుగులు వేస్తుంది... ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఇలాకాలో ఘోరంగా వెనుకబడింది బీజేపీ... గోరఖ్‌పూర్, ఫుల్పూర్ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి అనూహ్యంగా ఎదురుగాలి వీస్తోంది. రెండు లోక్‌సభ నియోజక వర్గాల్లోనూ ఎస్పీ-బీఎస్పీ కూటమి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. యూపీ సీఎం యోగికి కంచుకోటగా భావించే గోరఖ్‌పూర్‌లో బీజేపీ దారుణంగా వెనుకపడింది. 16వ రౌండ్ ముగిసే సమయానికి గోరఖ్‌పూర్‌లో సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి 24,529 ఓట్లు ఆధిక్యంలో నిలవగా...ఫుల్‌పూర్‌లోనూ సమాజ్‌వాది పార్టీ 30 వేల ఓట్ల ఆధిక్యంలో ఉంది.
అటు బీహార్‌లోనూ బీజేపీకి వ్యతిరేకమైన పవనాలు వీచాయి. అరారియా లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రెండో స్థానానికి పడిపోగా...ఆర్జేడీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ ఆర్జేడీ అభ్యర్థి 23 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆర్జేడీ అభ్యర్థికి 3,33,030 ఓట్లు పోల్ కాగా...బీజేపీ అభ్యర్థికి 3,09,863 ఓట్లు పోల్ అయ్యాయి.... మాకు కంచుకోట ఉత్తరప్రదేశ్ అంటూ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఖాలీ చేసిన స్థానాల్లోనే ఘోరంగా ఓడిపోయింది అంటే, మోడీ - అమిత్ షా నాయకత్వం మీద దేశ ప్రజలు మూడ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు...