ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనా విధానం అంటే అదో క్రేజ్.... రాష్ట్రపతి మొదలుకుని, కింద స్థాయి వరకు, అందరూ చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ కు వీరాభిమానులే... నిన్న రాష్ట్రపతి చంద్రబాబు పరిపాలన ప్రశంసిస్తూ ట్వీట్ చేసిన సంగతి మరువక ముందే, కన్నడ రియల్ స్టార్ట్ ఉపేంద్ర, తన ట్విట్టర్ లో, ఒకే ఒక్క పదంతో చంద్రబాబు పరిపాలనను ట్వీట్ చేసారు. చంద్రబాబు రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ లో రివ్యూ చేస్తున్న ఫోటో పోస్ట్ చేసి ఒకే ఒక్క పదంలో ‘Transparency’ అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ పెట్టి ట్వీట్ చేశారు.

upendra 28122017 2

కన్నడ రియల్ స్టార్ట్ ఉపేంద్ర, కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. వచ్చే కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తాను అని కూడా ప్రకటించారు. అయితే, ఇప్పుడు చంద్రబాబు పరిపాలనా విధానం నచ్చిన ఉపేంద్ర, ఆయన కోసం ఒక ట్వీట్ పోస్ట్ చేసారు. ఆ ట్వీట్ కి కూడా చాలా పోజిటివ్ కామెంట్స్ వచ్చాయి. "Classical LEADER + Great Administrator -------> @ncbn" "He is always pro tech....He will snach silicon valley fame from Bengaluru... wake up call" "CBN is tech savvy. #Karnataka specially #Bengaluru needs to be cautious about him.." ఇలా చాలా మంది చంద్రబాబు గురించి రెప్ల్ ఇచ్చారు.

upendra 28122017 3

నిజానికి ఇప్పటికే చాలా మంది సినిమా వారు చంద్రబాబు ఫాన్స్ అయ్యారు.... కమల హాసన్ మొన్నే టైమ్స్ నౌ ఇంటర్వ్యూ లో, చంద్రబాబు నాకు ఇన్స్పిరేషన్ అన్నారు. అలాగే మలయాళం సూపర్ స్టార్ట్ కూడా అమరావతి వచ్చి చంద్రబాబు కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అమితాబ్ బచ్చన్ కూడా ఒక సందర్భంలో మీ పని తీరు గొప్పది అన్నారు... అంత దాకా ఎందుకు, మన పక్కనే ఉన్న కేటీఆర్ స్వయంగా చంద్రబాబు వల్లే హైదరాబాద్ ఐటిలో ఇవాళ ఇలా ఉంది అంటూ కితాబు ఇచ్చారు... ఇంత మంది ఇన్ని రకాలుగా మన ముఖ్యమంత్రిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే, మన రాష్ట్రంలో కొంత మంది మాత్రం, అసత్య ప్రచారాలతో ఆయన పరువు తీస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read