ప‌క్కా తెలుగుదేశం అభ్య‌ర్థుల‌కు ప‌డ‌తాయ‌నుకునే ఓట్ల‌ని ల‌క్ష్యంగా చేసుకుని త‌ప్పుడు ప‌త్రాల‌తో ఓట్లు తొల‌గించార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. అయితే ఒక్క ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఆరువేల‌కు పైగా టిడిపి సానుభూతిప‌రుల ఓట్లు తొల‌గించారంటే, 174 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంకెన్ని తొల‌గించి ఉంటారో అనే ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఓట్ల తొలగింపుపై ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్ సీఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి నేరుగా క్షేత్ర‌స్థాయి ద‌ర్యాప్తున‌కు బృందాన్ని పంపించింది. త‌న‌ నియోజకవర్గంలో మొత్తం 6 వేల ఓట్లు తొలగించార‌ని ప‌య్యావుల ఆరోపిస్తున్నారు. కొందరి సంతకాలు ఫోర్జరితో ఓట్లు తొలగించార‌ని, కొంద‌రికి బోగ‌స్ నోటీసులు ఇచ్చిన‌ట్టు సృష్టించార‌ని మండిప‌డ్డారు. బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల తొలగింపుపై టీడీపీ తరపున కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామ‌ని పయ్యావుల కేశవ్ హెచ్చ‌రించారు. నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు శాసించిన మార్జిన్ కంటే ఎక్కువ టిడిపి సానుభూతిప‌రుల ఓట్లు తొల‌గించార‌ని చాలా రోజులుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ప‌య్యావుల కేశ‌వ్ ఫిర్యాదుతో ఈ ఓట్ల తొల‌గింపు స్కాం డొంక క‌దులుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read