గుంటూరు జిల్లా అమరావతి మండలం పరిధిలో కృష్ణా నదిపై 2,169 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. నీటిపారుదల శాఖ పనులపై జగన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం జారీచేసిన తాజా సర్క్యులర్ ప్రభావం ఈ పనులపై పడింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నీటి అవసరాల కోసం 10 టీఎంసీల సామర్థ్యంతో ప్రకాశం బ్యారేజీకి ఎగువన 30 కిలోమీటర్ల దూరంలో చేపట్టతలపెట్టిన ఈ బ్యారేజీ పనులకు ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. ఈ పనులను నవయుగ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. అయితే ఏప్రిల్ ముందు టెండర్ అయిన పనులను పునఃసమీక్షించాలని కొత్త ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడంతో సంస్థ పనులను నిలిపివేసింది. కార్మికులకు సెలవులిచ్చి పంపేసింది. యంత్రాలను కూడా బ్యారేజీ ప్రాంతం నుంచి తరలించింది.
ఈ ఏడాది ఏప్రిల్ 1కి ముందు టెండర్లు జరిగి.. ఒప్పందాలు చేసుకోని పనులన్నిటినీ రద్దు చే యాలని.. పనులు అప్పగించాక 25% వరకే జరిగితే ప్రభుత్వ అనుమతితోనే వాటిని కొనసాగించాలని ఇంజనీరింగ్ శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నుంచి నోట్ చేరింది. దీంతో జల వనరుల శాఖ చేపట్టేందుకు సిద్ధమైన పలు సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడివక్కడే ఆగిపోనున్నాయి. గోదావరి-పెన్నా అనుసంధానం పనులకు రూ.6,020 కోట్లకు పాలనామోదం ఇచ్చారు. వీటికి భూసేకరణ కోసం రూ.94 కోట్ల వర కూ వ్యయం చేశారు. నిర్మాణ పనులకు ఇంకా ఖర్చు చేయలేదు. గోదావరి-పెన్నా అనుసంధానం జరిగితే రాష్ట్ర జీవన విధానమే మారిపోతుందని.. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రకాశం జి ల్లాకు గోదావరి జలాలు తరలివెళ్తాయని.. క్రమంగా రాయలసీమకు కూడా గోదావరి జలాలను తరలించవచ్చన్న నిపుణుల సూచన మేరకు చంద్రబాబు దీనిని చేపట్టింది.
రూ.273 కోట్ల విలువ చేసే గుంటూరు చానల్ విస్తరణ పనులు, రూ.2,100 కోట్ల వైకుంఠపురం బ్యారేజీ పనులు, రూ.480 కోట్ల ముక్త్యాల పనులు కూడా నిలిచిపోనున్నాయి. నిర్మాణంలో ఉన్న పథకాలివీ.. వీటి పై కూడా సందిఘ్ధత నెలకొంది, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలిదశ పనులు, గాలేరు-నగరి రెండో దశ, బాలాజీ జలాశయం, వేణుగోపాల సాగర్ జలాశయం, ఎగువ పెన్నా ఎత్తిపోతల, భైరవానితిప్ప ఎత్తిపోతల పథకం, కమ్యూనిటీ ఎత్తిపోతల డ్రిప్ పథక, దమ్ములపల్లితోపాటు చెరువులకు నీటి సరఫరా, సోమశిల స్వర్ణముఖి లింకు కాలువ నుంచి మల్లెమడుగు జలాశయం, వేదవతి ఎత్తిపోతల పథకం, రాజోలిబండ మళ్లింపు పథకం, విస్సన్నపేట ఎత్తిపోతల పథకం, వరికపూడిశెల ఎత్తిపోతల పథకం, తోటపల్లి కాలువ ఆధునికీకరణ, చోడవరం వద్ద కొత్తగా బ్యారేజీ