గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రారంభించే ఎయిమ్స్ ఆస్పత్రికి మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్‌పేయి పేరు పెట్టాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ తరుపున, వాజ్‌పేయికి, అసలైన నివాళి ఇదే అని, ఆ దిశగా కేంద్రం ఆలోచించాలని కోరారు. వాస్తవానికి మూడేళ్ల క్రితమే బాబు సర్కారు ఈ సూచన చేసింది. అయితే దీనిపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. చంద్రబాబుకున్న ప్రత్యేక అనుబంధం, వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా, ఉమ్మడి రాష్ట్రానికి చేసిన సేవల నేపథ్యంలో కూడా ఎయిమ్స్‌కు వాజ్‌పేయి పేరు పెట్టాలని సూచించింది. ఎన్టీఆర్ హయాం నుంచే వాజ్‌పేయితో టీడీపీ సంబంధాలు కొనసాగాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక స్నేహ సంబంధాలు పటిష్టమయ్యాయి.

vajpayi 17082018 2

ఎయిమ్స్‌కు మందు మరో ఏ (అటల్) చేర్చితే సరిపోతుందని చంద్రబాబు అన్నారు. అయితే, ఈ విషయాన్ని కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి నిన్న కన్నుమూయడంతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. వాజ్‌పేయికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వాజ్‌పేయి మరణంతో దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని చెప్పారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి గొప్ప దార్శనికుడు, పరిపాలనాదక్షుడు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. పోఖ్రాన్‌ అణుపరీక్షలతో భారత్‌ సత్తాతో పాటు తన దార్శనికతను ప్రపంచానికి చాటిచెప్పారన్నారు. స్వర్ణచతుర్భుజి సహా మౌలికరంగ అభివృద్ధికి వాజ్‌పేయి విశేష కృషి చేశారని పేర్కొన్నారు.

vajpayi 17082018 3

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి వాజ్‌పేయి సహకారం ఇదే... నదుల అనుసంధానం, స్వర్ణ చతుర్భుజి నిర్మాణం ఆయన ఆలోచనలే.. ఆంధ్రప్రదేశ్‌లో తడ నుంచి ఇచ్ఛాపురం దాకా జాతీయ రహదారి అభివృద్ధి, వెలుగు ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంకు నిధులు, పనికి ఆహార పథకం కింద 50వేల టన్నుల బియ్యం, సూక్ష్మసేద్యం, ఐటీ రంగం అభివృద్ధి, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణంలో వాజ్‌పేయీ సహకారం మరువలేనిది. సూక్ష్మసేద్యంపై టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌గా చంద్రబాబుని నియమించినప్పుడు 3 మిలియన్‌ హెక్టార్లలో చేపట్టాలని నివేదిక ఇచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read