వైసీపీ ప్ర‌భుత్వంలో రెడ్ల‌కి త‌ప్పించి ఇత‌రుల‌కు ప్రాధాన్య‌త లేద‌ని వ‌చ్చిన ఆరోప‌ణ‌లు బ‌ల‌ప‌డిపోయాయి. వైసీపీలో కూడా ఇత‌ర సామాజిక‌వ‌ర్గ నేత‌లు త‌మ పార్టీలో రెడ్ల‌కి త‌ప్పించి ఇత‌రుల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌ర‌ని ఫిక్స‌యిపోయారు. ఒక వేళ ఇచ్చినా పెత్త‌నం మాత్రం రెడ్ల‌దేన‌ని చాలా మంది ఆఫ్ ది రికార్డు మీడియా మిత్రుల ద‌గ్గ‌ర వాపోతున్నారు. ఇటువంటి స‌మ‌యంలో  సీఎం జగన్ రెడ్డి త‌న‌పై సామాజిక‌వ‌ర్గ అన్యాయం అప‌ప్ర‌ధ‌ని తొల‌గించుకునేందుకు ఎమ్మెల్సీ స్థానాల‌ని ఓ అవ‌కాశంగా వినియోగించుకోవాల‌నుకున్నారు. బీసీలు, ఎస్సీలు ఈ స్థానాలు ప్ర‌క‌టించి మైలేజ్ కొట్టేద్దామ‌ని చాలా ప్లాన్ చేసుకున్నారు. రెండు రోజుల నుంచి జాబితా విడుద‌ల‌పై బ్రేకింగ్స్ ఇస్తూ, భారీ ప్ర‌చార ప్ర‌ణాళిక సిద్ధం చేశారు.  ఉద‌య‌మే స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియా స‌మావేశం పెట్టి ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎంపిక చేసిన అభ్య‌ర్థుల జాబితా ప్ర‌క‌టించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల‌కు ఎమ్మెల్సీలుగా చంద్రబాబు 37 శాతం అవకాశం ఇస్తే.. వైసీపీ 68 శాతం అవకాశం ఇచ్చామ‌ని ఘ‌నంగా ప్ర‌క‌టించారు. ఎమ్మెల్సీలకు ఇచ్చిన సామాజిక‌వ‌ర్గాల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకునే విధంగా ప్ర‌చారం కోసం భారీ ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. ఆయా సంఘాల సంబ‌రాలు, స‌న్మానాలు ప్లాన్ చేసుకున్నారు. ఇంత‌లోనే గ‌న్న‌వ‌రంలో టిడిపి కార్యాల‌యంపై ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ దా-డి-కి దిగారు. వాహ‌నాలు త‌గ‌ల‌బెట్టారు. రాష్ట్ర ప్రజలంతా ఎమ్మెల్సీల ఎంపిక‌లో సామాజిక న్యాయం గురించి మాట్లాడుకుంటార‌ని ఆశించిన సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి గ‌న్న‌వ‌రం ఇన్సిడెంటుతో షాక్ కొట్టిన‌ట్ట‌య్యింది. అంద‌రి దృష్టి పూర్తిగా గ‌న్న‌వ‌రం ఘ‌ట‌న‌పైకి మ‌ళ్ల‌డంతో త‌మ ఎమ్మెల్సీ ప్ర‌చారం మ‌రుగున‌ప‌డింద‌ని తాడేప‌ల్లి పెద్ద‌లు వంశీపై ఆగ్ర‌హంగా ఉన్నార‌ని స‌మాచారం. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి నేడో, రేపో వంశీని పిలిపించి సీఎం జ‌గ‌న్ రెడ్డి వ‌ద్ద‌కు తీసుకెళ్లే అవ‌కాశం ఉంద‌ని వైసీపీలో టాక్ న‌డుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read